
మలయాళ సూపర్‌హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో చిరంజీవి నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. వీవీ వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. మలయాళ సినిమాలో మోహన్‌లాల్ హీరోగా నటించారు. ఆయన పాత్రను చిరంజీవి చేస్తారు. స్క్రిప్ట్ పరంగా ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు ఓ సోదరి ఉంటుంది. ఈ పాత్రకు రమ్యకృష్ణ పేరుని పరిశీలిస్తున్నారట చిత్రబృందం. ‘లూసిఫర్’లో మోహన్‌లాల్ సోదరిగా మలయాళ నటి మంజూ వారియర్ నటించారు. గతంలో ‘ఇద్దరు మిత్రులు, అల్లుడా మజాకా’ వంటి సినిమాల్లో హీరోహీరోయిన్‌గా నటించారు చిరు, రమ్యకృష్ణ. మరి.. ‘లూసిఫర్’ లో అన్నా చెల్లెళ్లుగా నటిస్తే అది కచ్చితంగా విశేషమే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment