సోగ్గాడు హాఫ్ సెంచరీ కొట్టేశాడు | Soggade Chinni Nayana Enters in 50 Crores Club | Sakshi
Sakshi News home page

సోగ్గాడు హాఫ్ సెంచరీ కొట్టేశాడు

Published Sat, Feb 13 2016 3:26 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

సోగ్గాడు హాఫ్ సెంచరీ కొట్టేశాడు - Sakshi

సోగ్గాడు హాఫ్ సెంచరీ కొట్టేశాడు

సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు రిలీజ్ అయినా.. అన్నింటికంటే పెద్ద హిట్గా నిలిచిన సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా'. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ ఎన్టీఆర్, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నా.. భారీ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు ఇంతవరకు సాధ్యం కాని కలెక్షన్ల రికార్డ్లను సాధించి సత్తా చాటాడు నాగ్.

ఇప్పటివరకు పవన్, మహేష్, అర్జున్, చరణ్, ఎన్టీఆర్లకు మాత్రమే సాధ్యమైన 50 కోట్ల మార్క్ ను 4 వారాల్లో రీచ్ అయ్యాడు నాగార్జున. యంగ్ హీరోలు చాలామంది ఈ రికార్డ్ సాధించినా.., ఇంత పోటీలో లో నాగార్జున లాంటి సీనియర్ హీరో 50 కోట్ల కలెక్షన్లు సాధించటం అరుదైన ఘనతగానే భావిస్తున్నారు విశ్లేషకులు. కేవలం 15 కోట్ల బడ్జెట్తో రూపొందిన సోగ్గాడే చిన్ని నాయనా ఇప్పటికే 50 కోట్లకు పైగా వసూలు చేసి ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది.

నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. కళ్యాణ్ కృష్ణ, ఈ సినిమాతో దర్శకుడి పరిచయం కావటమే కాదు తొలి సినిమాతోనే భారీ హిట్ సాధించి స్టార్ హీరోల దృష్టిలో పడ్డాడు. నాగ్ తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమాతో బిగ్ హిట్తో పాటు భారీ కలెక్షన్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement