నాగ్ గెటప్ కోసం నటసామ్రాట్ కాస్ట్యూమ్స్ | Nagarjuna using akkineni nageswararao costumes for soggade chinni nayana | Sakshi
Sakshi News home page

నాగ్ గెటప్ కోసం నటసామ్రాట్ కాస్ట్యూమ్స్

Published Sat, Dec 19 2015 10:16 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగ్ గెటప్ కోసం నటసామ్రాట్ కాస్ట్యూమ్స్ - Sakshi

నాగ్ గెటప్ కోసం నటసామ్రాట్ కాస్ట్యూమ్స్

కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ సోగ్గాడే చిన్నినాయనా.. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్న నాగ్.. ఒక పాత్ర కోసం పల్లెటూరి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మనం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నాగ్ త్వరలో సోగ్గాడిగా అభిమానులను పలకరించనున్నాడు.

ఈ సినిమా కోసం నాగ్ ఎంచుకున్న గెటప్లో ఓ ప్రత్యేకత ఉందంటున్నారు చిత్రయూనిట్. ఎన్నో చిత్రాల్లో పల్లెటూరి పాత్రలు చేసిన తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావే తన పాత్రకు స్ఫూర్తి అంటున్నాడు నాగ్. అంతేకాదు ఈ సినిమాలో తన గెటప్ కోసం నాగ్ వాడిన కాస్ట్యూమ్స్ గతంలో అక్కినేని నాగేశ్వరరావు వాడినవే.. ఈ సినిమాలో నాగ్ వాడిన వాచీ కూడా 1959లో అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా కొన్నది కావటం మరో విశేషం.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సోగ్గాడే చిన్నినాయనా సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తుండగా, హంసానందిని, అనసూయ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement