సోగ్గాడే చిన్నినాయనా మరో సంచలనం
ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హీరోల సినిమాలు కూడా పది రోజులకు మించి థియేటర్లలో కనిపించే పరిస్థితి లేదు. సినిమా సక్సెస్ను కూడా ఎన్ని రోజులు ఆడింది అన్న దాంతో కాకుండా ఎంత కలెక్ట్ చేసిందీ అనే లెక్కలేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ సినిమా 50 రోజులు ఆడటం సాధ్యమేనా..? ఈ ప్రశ్నకు సమాధానం చూపించాడు నాగార్జున. సరైన కథా కథనాలతో ఆడియన్స్ ముందుకు వస్తే ఇప్పటికీ రికార్డ్ సెంటర్స్లో 50 రోజుల సినిమాలు సాధ్యమే అని ప్రూవ్ చేశాడు.
సంక్రాంతి బరిలో భారీ కాంపిటీషన్ మధ్య రిలీజ్ అయిన సినిమా సోగ్గాడే చిన్నినాయనా. మూడు సినిమాలతో పోటి పడి రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించటమే కాదు భారీ వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఇప్పటికే చాలా సెంటర్స్లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా 50 రోజులు రికార్డ్ నమోదు చేసింది. ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతున్న సోగ్గాడే చిన్నినాయనా 110 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.
నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కేవలం 10 కోట్ల లోపు బడ్జెట్తో రూపొంది 53 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తున్న సోగ్గాడే చిన్నినాయనా ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.