'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీ రివ్యూ | Soggade Chinni Nayana Movie Review | Sakshi
Sakshi News home page

'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీ రివ్యూ

Published Fri, Jan 15 2016 12:41 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీ రివ్యూ - Sakshi

'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీ రివ్యూ

టైటిల్ : సోగ్గాడే చిన్ని నాయనా
జానర్ : ఫాంటసీ ఫ్యామిలీ డ్రామా
తారాగణం : నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, సంపత్, నాజర్, బ్రహ్మనందం
సంగీతం : అనూప్ రుబెన్స్
దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
నిర్మాత : నాగార్జున


టాలీవుడ్ మన్మథుడు నాగార్జున 'మనం' తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మనం సినిమాలో ఏఎన్నార్తో కలిసి నటించిన నాగ్, ఈ సినిమాలో ఏఎన్నార్ను గుర్తు చేసే పాత్రతో సినిమా మీద అంచనాలను పెంచాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణను పరిచయం చేస్తూ నాగ్ చేసిన ఫాంటసీ ప్రయోగం సోగ్గాడే చిన్నినాయనా. చాలా కాలం క్రితం టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఉన్న ఆత్మలు తిరిగి రావటం అనే కాన్సెప్ట్కు కామెడీ జోడించి నాగార్జున చేసిన ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అయ్యింది..? సంక్రాంతి బరిలో సోగ్గాడి స్టామినా ఎంత..?

కథ :
రాము (నాగార్జున) అమాయకుడైన డాక్టర్. తన పని లోకం తప్ప భార్య సీత(లావణ్య త్రిపాఠి) గురించి అస్సలు పట్టించుకోడు. దీంతో రాము నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంటుంది సీత . ఆ విషయం చెప్పడానికి అత్తగారు సత్తమ్మ (రమ్యకృష్ణ) దగ్గరికి వస్తుంది. కళ్ల ముందే కొడుకు కాపురం పాడవటం చూడలేని సత్తమ్మ ముప్పై ఏళ్ల క్రితం చనిపోయిన భర్త బంగార్రాజు ( నాగార్జున)ను గుర్తు చేసుకుంటుంది. నరకంలో అమ్మాయిలతో సరదాగా గడుపుతున్న బంగార్రాజు భార్యకు సాయం చేయడానికి యముడి అనుమతితో భూలోకానికి వస్తాడు. కొడుకు కాపురం సరిద్దిదే సమయంలో తన చావు యాక్సిండెంట్ కాదని, హత్య అని తెలుసుకుంటాడు. అంతేకాదు అదే సమయంలో తన కొడుకుతో సహా తన కుటుంబం అంతా ప్రమాదంలో ఉందని తెలిసి వారిని కాపాడే ప్రయత్నం చేస్తాడు. అసలు బంగార్రాజును ఎవరు ఎందుకు చంపారు..? వారి బారి నుంచి బంగార్రాజు తన కుంటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే మిగతా కథ..?

నటీనటులు :
అమాయకుడైన రాముగా, సరదాగా కనిపించే బంగార్రాజుగా రెండు విభిన్న పాత్రల్లో నాగార్జున ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బంగార్రాజు లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న నాగ్, ఆ పాత్రతో ఏఎన్నార్ను గుర్తు చేశాడు. చాలా కాలం తరువాత నాగ్తో కలిసి నటించిన రమ్యకృష్ణ, గ్లామర్ విషయంలో ఈ జనరేషన్ హీరోయిన్లకు పోటీ ఇచ్చింది. లావణ్యత్రిపాఠి క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంది. కొద్ది రోజులుగా కామెడీ పండించలేక ఇబ్బంది పడుతున్న బ్రహ్మనందం, ఈ సినిమాలో ఆత్మలతో మాట్లాడే బాబాగా బాగానే నవ్వించాడు. నాజర్, సంపత్, పోసాని కృష్ణ మురళిలు తమ పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశారు. హంసనందిని, అనసూయల గ్లామర్ సినిమాకు మరింత హెల్ప్ అవ్వగా, అనుష్క గెస్ట్ అప్పీయరెన్స్ ఆడియన్స్కు షాక్ ఇచ్చింది.

సాంకేతిక నిపుణులు :
చాలా కాలం క్రితమే తెలుగు తెర మీద సందడి చేసిన ఆత్మలు తిరిగి రావటం అనే కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్న కళ్యాణ్ కృష్ణ మంచి విజయాన్నే సాధించాడు. ముఖ్యంగా నాగార్జున ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతకు పూర్తి న్యాయం చేశాడు. పల్లెటూరి యాసలో నాగార్జున చెప్పిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా నాగ్ గెటప్ విషయంలో తీసుకున్న కేర్ ప్రతీ ఫ్రేమ్లో కనిపిస్తుంది. సినిమాటోగ్రఫి చాలా బాగుంది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద పల్లె అందాలను బాగా చూపించారు. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన మరో అంశం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఆడియోతో సినిమా రిలీజ్కు ముందే మంచి విజయం సాధించిన అనూప్ నేపధ్య సంగీతంతో సినిమా స్థాయిని మరో మెట్టెక్కించాడు.

ప్లస్ పాయింట్స్ :
నాగార్జున, రమ్యకృష్ణ
సెకండాఫ్ కామెడీ
నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :
స్ట్రాంగ్ విలనిజం లేకపోవటం
స్లో నారేషన్
రొటీన్ టేకింగ్

ఓవరాల్గా సోగ్గాడే చిన్నినాయనా, ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే మంచి ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్


- సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement