బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ అదరగొట్టింది. ఆరో వారాంతానికి నాగార్జున అందుబాటులో లేనందున స్పెషల్ గెస్ట్‌తో షోను నడిపించారు. ఇక ఫస్ట్ టైమ్ తన హోస్టింగ్‌తో హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియెన్స్‌ను రమ్యకృష్ణ ఆకట్టుకుంది. హౌస్‌లో అన్యాయానికి గురైన మహిళలకు, న్యాయం చేసింది. తన రాజ్యంలో మహిళల పట్ల చిన్న చూపు తగదన్నట్లు తీర్పునిచ్చింది. వరుణ్ సందేశ్ మొహంపై కాఫీ పోయడం, రాహుల్ బట్టలను కత్తిరించడం, రవికి సంబంధించిన బెడ్‌ను నీటితో తడపటంలాంటి ఆదేశాలను జారీ చేసింది.