నాగ్.. విజయ్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ‘నీ పెళ్లి గురించి ఎప్పుడూ రూమర్స్ వస్తూనే ఉంటాయి. మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్’ అని అడిగాడు. దీనికి రౌడీ స్పందిస్తూ ‘ఇంకా తన అమల దొరకలేదు’ అని నాగ్‌కు ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. దీనికి నాగ్ బదులిస్తూ ‘నీకు నీ అమల త్వరగా దొరకాలని కోరుకుంటున్నా’నని తెలిపాడు. దీంతో నేటి ఎపిసోడ్ సరదాగా సాగుతున్నట్టు కనిపిస్తోంది.