పీకలదాక కోపం ఉందంటోన్న నాగ్‌ | Nagarjuna Looks Like Serious On Housemates | Sakshi
Sakshi News home page

పీకలదాక కోపం ఉందంటోన్న నాగ్‌

Published Sat, Sep 14 2019 5:12 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ వారంలో కొందరు ఇంటిసభ్యులు తిరుగుబాటు చేశారు. బిగ్‌బాస్‌ ఆదేశాలనే ధిక్కరించారు. ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం అనే టాస్క్‌లో పునర్నవి, మహేష్‌, శ్రీముఖిలు చెత్త పర్ఫామెన్స్‌ ఇచ్చిన కారణంగా.. వారికి పనిష్మెంట్‌ను ఇచ్చే క్రమంలో షూ పాలిష్‌ చేయాలనే టాస్క్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిని మహేష్‌, పునర్నవిలు వ్యతిరేకించారు. చివరకు శివజ్యోతి సముదాయించడంతో మహేష్‌ దిగివచ్చాడు. అయితే పునర్నవి మాత్రం ఇంకా బెట్టు చేస్తూనే ఉండటం.. ఆఖరికి వరుణ్‌ సందేశ్‌ బతిమిలాడటంతో షూలను పాలిష్‌ చేసింది. అయినా సరే తనకు ఈ టాస్క్‌లు నచ్చలేదని బిగ్‌బాస్‌ను వేలెత్తి చూపించింది.

అయితే వీటన్నంటిపై నాగార్జున సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్‌ హౌస్‌మేట్స్‌కు బ్యాండ్‌ బాజా భారాత్‌ ఉండబోతోన్నట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోను బట్టి నాగ్‌.. బాగానే సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. డ్యాన్సర్లను కూడా డ్యాన్స్‌ చేయొద్దని పంపిస్తూ.. పీకలదాక కోపం ఉంది.. ముందు హౌస్‌మేట్స్‌తో మాట్లాడాలి అంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఎవరెవరికి ఏ రకంగా క్లాస్‌ పీకుతాడో చూడాలి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement