
కథానాయికగా రమ్యకృష్ణ ఎన్ని సినిమాలు చేసినా.. ఆమె పేరు చెప్పగానే ‘నరసింహ’ సినిమాలోని నీలాంబరి పాత్ర గుర్తుకురాక మానదు. ‘బాహుబలి’ సినిమా విడుదల తర్వాత అందరూ ఆమెను ‘శివగామి’ అంటున్నారు. మరోసారి శివగామిగా ఆమె వెండితెరపై సందడి చేయనున్నారు. అంటే.. ‘బాహుబలి 3’ ఏమైనా తీయనున్నారా? అనే అనుమానం రాకమానదు. రమ్య మరోసారి శివగామిగా అలరించనున్నది తెలుగువారిని కాదు.
కన్నడ ప్రేక్షకులను. అసలు విషయానికొస్తే... రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో 9వ శతాబ్దానికి చెందిన రాణి శివగామి కథాంశంతో కన్నడంలో ఓ సినిమా రూపొందనుందట. దర్శకుడు మధు ఈ చారిత్రాత్మక సినిమాని తెరకెక్కించనున్నారట. ఇప్పటికే కథ–స్క్రీన్‌ప్లే పూర్తి చేసుకున్న ఆయన రమ్యకృష్ణకు వినిపించారట. పవర్‌ఫుల్ రాణి పాత్ర కావడంతో ఆమె నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కొత్త సంవత్సరంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment