నాగచైతన్య
అత్తారింటికెళ్లాడు అల్లుడు. ఆతిథ్యంలో తేడా వస్తే అమ్మాయిపై ఉన్న ప్రేమతోనో, అత్తింటిపై ఉన్న గౌరవంతోనో.. సర్లే అని సర్దుకుంటాడు. కానీ అత్త తనపై పెత్తనం చేయాలంటే ఊరుకుంటాడా? అబ్బే... అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. సొగసరి అత్తకి ఘాటైన రిప్లై ఇచ్చాడు గడసరి అల్లుడు. ఎలా అంటే.. స్క్రీన్‌పై చూడాల్సిందే. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని టాక్. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. రమ్యకృష్ణ అత్త క్యారెక్టర్ చేస్తున్నారని టాక్. రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన ఫస్ట్ షెడ్యూల్‌లో కథానాయిక ఇంట్లోని సీన్స్‌ను తెరకెక్కించారు. సినిమా స్టార్టింగ్‌లో హీరో, హీరోయిన్లలపై కాలేజీ అండ్ పార్క్ సీన్స్‌ను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 19న స్టార్ట్ కానుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment