అటు చామంతి... ఇటు పూబంతి | Mama Manchu Alludu Kanchu Release On Dec' 25 | Sakshi
Sakshi News home page

అటు చామంతి... ఇటు పూబంతి

Published Fri, Dec 11 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

అటు చామంతి... ఇటు పూబంతి

అటు చామంతి... ఇటు పూబంతి

 ‘ముద్దిమ్మంది ఓ చామంతీ... మనసిమ్మంది ఓ పూబంతి...’ అంటూ రమ్యకృష్ణ, మీనాతో ‘అల్లరి మొగుడు’లో మోహన్‌బాబు చేసిన రొమాన్స్ అప్పట్లో ప్రేక్షకులకు కనువిందు. ఆ పాటలో ముగ్గురూ చూడముచ్చటగా అనిపిస్తారు. ఆ హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే ఆ ప్రాజెక్ట్‌కి భారీ ఎత్తున క్రేజ్ నెలకొనడం ఖాయం. ఈ ముగ్గురికీ ‘అల్లరి’ నరేశ్ కూడా తోడైతే ఇక చెప్పడానికి ఏముంటుంది...! రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్... ఇలా అన్ని అంశాలతో ఫుల్‌మీల్స్ లాంటి సినిమా తయారై ఉంటుందని ఊహించవచ్చు.
 
  ‘మామ మంచు - అల్లుడు కంచు’ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం పాటలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. చిత్రవిశేషాలను నిర్మాత చెబుతూ - ‘‘సినిమా టైటిల్ ప్రకటించినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
  ఫస్ట్ లుక్ విడుదల చేసిన తర్వాత చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. కోటి, అచ్చు, రఘు కుంచె అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారికీ నచ్చుతుంది’’ అన్నారు. నరేశ్‌తో పూర్ణ జత కట్టిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కెమెరా: బాల మురుగన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విద్యా నిర్వాణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement