సినిమా: బాలీవుడ్ బిగ్‌బీ అమితాబచ్చన్ సరసన దక్షిణాది సంచలన నటి రమ్యకృష్ణ జత కట్టబోతోందన్నది తాజా సమాచారం. ఇంతకు ముందు కథానాయకిగా నటించిన గ్లామరస్ పాత్రలను ఇరగదీసిన ఈమె, ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి మరోసారి తన సత్తా చూపిస్తోంది. బాహుబలి రాజమాతగా నటించి ఆ పాత్రకు హోదాను తీసుకొచ్చిన రమ్యకృష్ణ ఆ తరువాత పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రల్లో నటిస్తోంది. కాగా ఇటీవల కోలీవుడ్‌లో సూపర్ డీలక్స్ చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన పాత్ర పలు విమర్శలకు దారి తీస్తోంది.
తాజాగా అమితాబ్‌బచ్చన్‌తో జత కట్టడానికి రమ్యకృష్ణ సిద్ధం అవుతోందని సమాచారం. నటుడు ఎస్‌జే సూర్య హీరోగా నటించనున్న చిత్రం ఉయర్నద మనిదన్. ఇంతకు ముందు ఈయన హీరోగా కల్వనిన్ కాదలి చిత్రాన్ని తెరకెక్కించిన తమిళ్‌వానన్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న ఇది ఉయర్నద మనిదన్. తమిళం, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. కాగా ఆయనకు జంటగా రమ్యకృష్ణ నటించనున్నట్టు సమాచారం. అమితాబ్ బచ్చన్ కోలీవుడ్‌లో నేరుగా నటిస్తున్న చిత్రం ఇదే అవుతోంది. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు రజనీకాంత్ విడుదల చేయడం మరో విశేషం కాగా ఆయన నటుడు అమితాబ్ బచ్చన్‌ను కోలీవుడ్‌కు ఆహ్మానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నటుడు ఎస్‌జే సూర్య మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్‌తో నటించడానికి సహకరించిన రజనీకాంత్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment