Dance IKON Show: Fight Between Sreemukhi and Syed Sohel Ryan - Sakshi
Sakshi News home page

డ్యాన్స్‌ ఐకాన్‌లో మాటల యుద్ధం, సోహైల్‌పై శ్రీముఖి ఫైర్‌

Published Tue, Nov 15 2022 7:05 PM | Last Updated on Tue, Nov 15 2022 8:07 PM

Dance Ikon: Fight Between Sreemukhi and Syed Sohel Ryan - Sakshi

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారం అవుతున్న డాన్స్ ఐకాన్ షో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఈ షో లో కొత్తగా  ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ వచ్చీ రావడంతోనే మాటల యుద్ధం మొదలయ్యింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నాటు నాటు పాటకి అసిఫ్ అండ్ రాజు కలిసి చేసిన డ్యాన్స్‌కు సోహైల్ రెడ్ బోర్డు చూపించాడు. దాంతో హర్ట్‌ అయిన శ్రీముఖి.. అది మోనాల్ కూర్చున్న సీట్ ప్రభావం అంటూ గొడవ మొదలుపెట్టింది.

దానికి సోహైల్ వాళ్ళిద్దరి మధ్య కో ఆర్డినేషన్ లేదని చెప్పాడు. తర్వాత గోవింద్, సౌమ్య డ్యాన్స్ చేసినప్పుడు యష్ మాస్టర్, శ్రీముఖి పెదవి విరిచారు. దీంతో సోహైల్ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించడంతో శ్రీముఖి వెటకారం స్టార్ట్ చేసింది. ఈ లోగా రమ్యకృష్ణ కూడా మీరు చెప్పినట్టు చెప్పడానికి ఈ సీట్‌లో మేము కూర్చోవడం ఎందుకు అంటూ సీరియస్ అయ్యింది. మరి ఈ డాన్స్ రియాలిటీ షోలో ఇంకా ఎన్ని ట్విస్టులు, టర్నులు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వారం డాన్స్ ఐకాన్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

చదవండి: కృష్ణ సినిమాల్లోకి రావడానికి కారణమెవరో తెలుసా?
అదే సూపర్‌స్టార్‌ కృష్ణ చివరి సినిమా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement