
అమ్మదొంగ, మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది ఆమని. ఒకప్పుడు హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం హీరోహీరోయిన్ల తల్లి, అత్త పాత్రల్లో నటిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కళ్లముందు జరిగిన ఘోరాన్ని చెప్పుకొచ్చింది. 'నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది. కెమెరామన్ లోక్ సింగ్ గారు నా కళ్లముందే మంటల్లో కాలిపోయారు. ఆ రోజు జూబ్లీహిల్స్‌లో ఓ పాట షూట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బండలపై పెట్రోల్ పోశారు. ఆ మంటల మధ్యలో మేము డ్యాన్స్ చేస్తున్నాం. లోక్‌నాధ్‌గారు పైన క్రేన్‌లో ఉన్నారు. ఫస్ట్ టేక్ ఓకే అయింది.
కానీ ఆయనకు మంటలు ఇంకాస్త ఎక్కువుండాలంటూ వన్ మోర్ అన్నాడు. అప్పుడు చలికాలం కావడంతో మేము దుప్పటి పట్టుకుని ఓ పక్కన కూర్చున్నాం. తిరిగి లొకేషన్‌లో మంటలు అంటిస్తున్నారు. ఆ క్రేన్‌లో ఉన్న వ్యక్తి కిందకు దిగి వచ్చి మీరు సరిగా పెట్రోల్ పోయడం లేదంటూ చెంబు అందుకున్నాడు. ఓ బండపైన పెట్రోల్ పోశాడు. అంతే ఆ పక్కనున్న ఫైర్ ఒక్కసారిగా లేచి ఈయనకు కూడా మంటలంటుకున్నాయి. మా కళ్ల ముందే ఆయన నిలువునా కాలిపోయాడు. మరణం ఆయన్ను పిలిచింది. లేదంటే ఎక్కడో కూర్చున్న వ్యక్తి పెట్రోల్ పోయడమేంటి? అది అంటుకోవడమేంటి? చాలా భయంకరమైన మరణమిది' అని గుర్తు చేసుకుంది ఆమని.
Comments
Please login to add a commentAdd a comment