
ఆమని మాట్లాడుతూ.. ఒక నటికి ఎన్ని పాత్రలు చేసినా సంతృప్తి రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన ఉంటుంది. మణిరత్నం, రాజమౌళి, సుకుమార్, పూరీ జగన్నాథ్‌గార్ల చిత్రాల్లో నటించాలనుందన్నారు.
‘‘అల్లంత దూరాన’ సినిమా కళాశాల నేపథ్యంలో నడిచే మంచి ప్రేమకథ. యువతరానికి బాగా నచ్చేలా ఉంటుంది’’ అని నటి ఆమని అన్నారు. విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాస్ జంటగా ఆమని అతిథి పాత్రలో నటించిన చిత్రం ‘అల్లంత దూరాన’. చలపతి పువ్వల దర్శకత్వంలో కోమలి సమర్పణలో ఎన్. చంద్రమోహనరెడ్డి నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఆమని మాట్లాడుతూ– ‘‘నా మేనకోడలు హ్రితిక పెద్ద డైలాగ్‌ని కూడా సింగిల్ టేక్‌లో చెప్పడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఒక నటికి ఎన్ని పాత్రలు చేసినా సంతృప్తి రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన ఉంటుంది. మణిరత్నం, రాజమౌళి, సుకుమార్, పూరీ జగన్నాథ్‌గార్ల చిత్రాల్లో నటించాలనుంది’’ అన్నారు. ‘‘అల్లంత దూరాన’ వంటి మంచి సినిమాతో తెలుగులో పరిచయమవుతుండటం హ్యాపీ’’ అన్నారు హ్రితిక శ్రీనివాస్. ‘‘త్వరలో మా సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు కోమలి.