
నటుడు సత్యప్రకాశ్ తనయుడు నటరాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అమ్మ దీవెన’. శివ ఏటూరి దర్శకుడు. ఎత్తరి గురవయ్య నిర్మాత. ఆమని, పోసాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఒక్క పాట మినహా పూర్తయింది. ‘‘ప్రతి తల్లి కుటుంబం కోసం పడే కష్టం, తపన ప్రధానాంశాలుగా తీసుకుని చేస్తున్న చిత్రం ఇది. మదర్ సెంటిమెంట్‌తో పాటు యూత్‌ను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి’’ అన్నారు. ‘‘మా కుటుంబంలో జరిగిన వాస్తవ సంఘటనలతో తీస్తున్న చిత్రం ఇది. ఆమనిగారి పాత్రలో ప్రతి కొడుకు తన తల్లిని చూసుకుంటాడు. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.వి.హెచ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్.
Comments
Please login to add a commentAdd a comment