శ్రీధర్ శ్రీమంతుల
‘‘బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తక్కువ సమయంలో కోటీశ్వరుడు అయిపోవచ్చని, లైఫ్ సెటిల్ అవుతుందనుకుని ఓ మధ్యతరగతి అబ్బాయి అనుకుంటాడు. ఆ ఆలోచన అతని జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది? అన్నదే ‘కళాకారుడు’ సినిమా అని హీరో, నిర్మాత శ్రీధర్ శ్రీమంతుల అన్నారు. శ్రీధర్, దుర్గ జంటగా పోసాని కృష్ణమురళి, తోటపల్లి మధు, రవివర్మ, ‘జబర్దస్త్’ జీవన్ ముఖ్య తారాగణంగా కిరణ్ దుస్సా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళాకారుడు’. శ్రీస్ విజువల్స్ పతాకంపై శ్రీధర్ శ్రీమంతుల నిర్మించిన ఈ సినిమా జనవరి 3న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హీరో, నిర్మాత శ్రీధర్ శ్రీమంతుల మాట్లాడుతూ– ‘‘భీమవరంలో పుట్టి పెరిగాను. సినిమాల మీద మక్కువతో తొలిసారి ‘కళాకారుడు’ చిత్రం చేశా. మంచి కుటుంబ కథా చిత్రమిది. వినోదంతో పాటు మాస్ ప్రేక్షకులను అలరించే ఫైట్స్ ఉన్నాయి. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా. రఘురామ్‌గారు మంచి సంగీతం అందించారు. చాలా సినిమాల్లో, సీరియల్స్‌లో బాల నటిగా చేసిన దుర్గ మా సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. డైరెక్టర్ కె. విశ్వనాథ్‌గారు అంటే నాకు చాలా అభిమానం.. ఆయనలా డైరెక్టర్ అవ్వాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment