కాంగ్రెస్‌కే బ్లాక్‌డే: కిషన్‌రెడ్డి | Kishan Reddy alleged that the announcement was announced as black day | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కే బ్లాక్‌డే: కిషన్‌రెడ్డి

Published Thu, Nov 9 2017 3:49 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

Kishan Reddy alleged that the announcement was announced as black day - Sakshi

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశ ప్రజలంతా స్వాగతిస్తుంటే, కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్‌ మాత్రమే ఆందోళన చెందుతున్నదని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని నిర్మూలించడానికి ప్రధాని మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం చరిత్రాత్మకమన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించకుండా కాంగ్రెస్‌ పార్టీ కళ్లు లేని కబోదిలా వ్యవహరిస్తోందని విమర్శించారు. అసెంబ్లీలో దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్‌ నేతలు తమ కడుపుమంటను బయట పెట్టుకున్నారని అన్నారు. అవినీతిపరులకు కొమ్ముకాస్తూ పెద్దనోట్ల రద్దును బ్లాక్‌ డే గా ప్రకటించారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నో కుంభ కోణాలకు పాల్పడిన కాంగ్రెస్‌పార్టీకే తప్ప దేశప్రజలకు బ్లాక్‌డే కాదని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement