
బాబోయ్.. బడి
వామ్మో, ఇవేం బడులు.. ఎప్పుడు కూలుతాయో తెల్వదు. వర్షాలకు చెమ్మగిల్లుతున్న గోడలు.. పెచ్చులూడుతున్న పైకప్పులు. జీర్ణావస్థలో ఉన్న గదుల్లోనే పాఠాలు.. భయం గుప్పిట్లో చిన్నారులు.. భవనాల దుస్థితిపై పిల్లల తల్లిదండ్రులు సైతం బెంబేలు.. ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడి చేసే అధికారులు.. ఆపై పట్టనట్టు వ్యవహరించే యంత్రాంగం.. పాఠశాలలు పునఃప్రారంభమైనా దుస్థితి మారకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
స్కూళ్ల దుస్థితి ప్రభుత్వ పాఠశాలల భవనాలను చూస్తేనే భయమేస్తోంది. అందులో కూర్చోని పాఠాలు వినడానికి చిన్నారులు బెంబేలెత్తిపోతున్నారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పెల్చులూడి ఇనుప చువ్వలు తేలాయి. కొన్ని చోట్ల గదులు కూలిపోగా పక్క గదుల్లోనే పాఠాలు బోధిస్తున్నారు. ముందే వర్షాకాలం ఎప్పుడు కూలుతాయో తెలియక విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ పాఠాలు వింటున్నారు. పిల్లల తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు.
- సాక్షి నెట్‌వర్క్