‘వాసవి’ వద్ద తీవ్ర ఉద్రిక్తత
‘వాసవి’ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Published Fri, Mar 24 2017 12:26 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM
పెదతాడేపల్లి (తాడేపలి్లగూడెం రూరల్ ) : పెదతాడేపల్లి వాసవి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్య గురువారం రాత్రి 10 గంటలకు కూడా పరిష్కారం కాలేదు. మరోసారి శుక్రవారం నాటికి వాయిదా పడింది. కళాశాల బీటెక్ మెకానికల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 15 మందికి యాజమాన్యం అటెండె న్స్ తక్కువ చూపుతూ పరీక్షకు హాజరుకాకుండా(డిటెయిన్) చేసిందని విద్యార్థుల వాదన. ఎటువంటి సమాచారం లేకుండా తమను డిటెయిన్ చేస్తున్నట్టు ప్రకటించారని, అది కూడా వేరే బ్రాంచ్ నోటీస్ బోర్డులో తమ పేర్లు పెట్టారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం సహచర విద్యార్థులు చెప్పడంతో బుధవారం కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించగా తాత్సారం చేశారని పేర్కొంటున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆందోళన చేపట్టామన్నారు. అయితే గురువారం రికార్డులు సరి చూస్తామని చెప్పారని, నలుగురు విద్యార్థుల అటెండె న్స్ విషయంలో పొరపాటు జరిగిందని తెలిపారన్నారు. వారితో పాటు మరో ఇద్దరికి అటెండెన్స్ అడ్జెస్ట్‌మెంట్ చేసి పరీక్షకు హాజరయ్యేలా చూస్తామని చెప్పారన్నారు. మిగిలిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంలో పడింది. దీంతో గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మరోసారి మెకానికల్ బ్రాంచి విద్యార్థులు బస్సులను నిలుపుదల చేసి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఒకానొక సమయంలో మెకానికల్ విద్యార్థులు కళాశాల భవనాలు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. రాత్రి 9.30 గంటలకు విద్యార్థులు బస్సులకు అడ్డంగా పడుకున్నారు. తదుపరి తాడేపల్లిగూడెం రూరల్ సీఐ జి.మధుబాబు, పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి, ఎస్సై ఎం.సూర్యభగవాన్‌ఆధ్వర్యంలో రాత్రి 9.40 గంటలకు విద్యార్థులను బయటకు లాగారు. చర్చల పేరుతో మెకానికల్ బ్రాంచి విద్యార్థులను మభ్యపెట్టి రాత్రి 9.50 గంటలకు మిగిలిన విద్యార్థులను బస్సుల్లో వారి వారి స్వస్థలాలకు తరలించారు. రాత్రి 10 గంటలకు కూడా మెకానికల్ విద్యార్థుల సమస్య పరిష్కారం కాలేదు. శుక్రవారం నాటికి వాయిదా వేశారు. సోమవారం నుంచి మెకానికల్ విద్యార్థులకు రెండో సెమిస్టర్ ప్రారంభం కానుంది.
యాజమాన్యం వాదన
ఆందోళన చేస్తున్న మెకానికల్ బ్రాంచి విద్యార్థులకు 40 నుంచి 50 శాతం మాత్రమే అటెండ న్స్ ఉందని కళాశాల కరస్పాండెంట్ చలంచర్ల సుబ్బారావు తెలిపారు. నూటికి నూరు శాతం అటెండె న్స్ తప్పనిసరని, 65 నుంచి 75 శాతం వరకూ ఉన్నా అర్హత పొందే అవకాశం ఉంద న్నారు. చివరకు మెడికల్ సర్టిఫికెట్‌తో కూడా వారికున్న అటెండె న్స్‌పై విద్యార్థులు పరీక్షకు అర్హత పొందే అవకాశం లేదని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement