చేతులెత్తేశారు.. | As chaos polio vyaksinesan | Sakshi
Sakshi News home page

చేతులెత్తేశారు..

Published Sun, Jun 26 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

చేతులెత్తేశారు..

చేతులెత్తేశారు..

గందరగోళంగా పోలియో వ్యాక్సినేషన్
గుర్తించింది 2.5 లక్షలు.. వేసింది 3.16 లక్షలు
వ్యాక్సిన్ కొరతతో  మన్సూరాబాద్ కేంద్రానికి తాళం
ఆస్పత్రి ముందు తల్లిదండ్రుల ఆందోళన

 

సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మంగా చేపట్టిన పోలియో టీకాల కార్యక్రమం గందరగోళంగా మారింది. ఆరోగ్య కేంద్రానికి వచ్చే ఆఖరి బిడ్డ వరకు వ్యాక్సిన్ వేస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. వ్యాక్సిన్ లేక చేతులెత్తేసింది. బస్తీల్లోని పిల్లలను అంచనా వేయడంలోను, వ్యాక్సిన్ సరఫరాలోనూ వైద్య ఆరోగ్యశాఖ ఘోరంగా విఫలమైంది. టీకాల కోసం ప్రతిరోజు పలు ఆరోగ్య కేంద్రాల వద్ద భారీగా బారులు తీరుతున్నారు. ఆదివారం టీకాలు వేసేందుకు చివరి రోజుగా ప్రకటించడంతో వ్యక్తిగత పనులను వాయిదా వేసుకుని పిల్లలకు టీకాలు వేయించేందుకు తల్లిదండ్రులు భారీగా తరలి వచ్చారు. వ్యాక్సిన్ కొరత వల్ల కొన్నిచోట్ల పోలీసుల సహకారంతో పిల్లలకు టీకాలు వేస్తే, మరి కొన్ని చోట్ల పోలియో కేంద్రాలకు తాళాలు వేయాల్సిన దుస్థితి తలెత్తింది. దీంతో తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయాలంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.


ప్రభుత్వం గుర్తించిన హైరి స్కు ప్రాంతాలతో పాటు దానికి ఆనుకుని ఉన్న బస్తీల్లో ఎంత మంది పిల్లలు ఉన్నారు? ఎంత మంది వ్యాక్సిన్ వేయిం చుకునే అవకాశం ఉంది? ఎంత సరఫరా చేయాలి? వ ంటి అంశాలను అధికారులు అంచనా వేయలేక పోయారు. ఇదిలా ఉం టే, హైరిస్కు జోన్లలో 2.5 లక్షల మంది పిల్లలను గుర్తించామని, వీరందరికీ టీకా లు వేశామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లోని పిల్లలు టీకాలు వేయించుకోక పోయినా నష్టమేమీ లేదని స్పష్టం చేయడం గమనార్హం.

 
అంచనాలో ఘోర విఫలం..

అంబర్‌పేట నాలాలో వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు నిర్థారణ కావడంతో ఆ ప్రాంతంతో ముడిపడి ఉన్న హైదరాబాద్ జిల్లాలోని 69 ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అంబర్‌పేట, బార్కాస్, కంటోన్మెంట్, మలక్‌పేట్, కోఠి, లాలాపేట్, డబీర్‌పుర, జంగంమెట్, పానిపుర, సీతాఫల్‌మండి, సూరజ్‌భానులో ప్రభుత్వం 750 పోలియో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని 12 ఆరోగ్య కేంద్రాల పరిధిలోని కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, బాలానగర్, ఉప్పల్, నారపల్లి, కీసర, అబ్దుల్లాపూర్, సరూర్‌నగర్, బాలాపూర్‌లో 136 కేంద్రాలను ఏర్పాటు చేసింది. కంటోన్మెంట్ సహా ఈ 24 హైరిస్కు ప్రాంతాల్లో ఆరు వారాల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 2.50 లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు. కేవలం ైెహ రిస్కు జోన్ల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పిల్లలు భారీగా పోటెత్తడంతో తొలి రెండు రోజుల్లోనే వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో మరో లక్ష డోసులు అదనంగా తెప్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ పిల్లలను అంచనా వేయడంలోనే కాదు.. చివరకు వాక్సిన్            తె ప్పించడంలోనూ వైద్య ఆరోగ్యశాఖ ఘోరంగా విఫలమైంది.

 
మన్సూరాబాద్ కేంద్రానికి తాళాలు

వ్యాక్సిన్ కోసం పిల్లలతో మన్సూరాబాద్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న తల్లి దండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. వ్యాక్సిన్ లేకపోవడంతో స్థానికులు ఎక్కడ తమపై దాడి చేస్తారోనని భయపడిన సిబ్బంది కేంద్రానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. మన్సూరాబాద్ పట్టణ ఆరోగ్య కేం ద్రంలో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాంప్‌ను ఏర్పాటు చేశామని, ఇక్కడి వీకర్ సెక్షన్‌కాలనీ కమ్యూనిటీహాల్‌లో శనివారం రోజంతా కేంద్రం కొనసాగిం దని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఆదివారం పోలియో ఇంజక్షన్ వేయాలనే ఆదేశం తమకు లేదని, అందుకే తాము టీకాలు వేయడం లేదని సిబ్బంది తెలి పారు. అంబర్‌పేట్‌లోని ప్రాధమిక ఆరో గ్య కేంద్రానికి స్థానిక పిల్లలతో పాటు ఉప్పల్, రామంతాపూర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి పోటెత్తడంతో వారిని నియంత్రించడం కష్టమై పోలీ సుల సాయం తీసుకోవాల్సి వచ్చింది.

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement