
సముద్రాన్ని ఇంత భయానకంగా ఎప్పుడూ చూడలేదు
తమ జీవితంలో సముద్రాన్ని ఇంత భయంకరంగా ఎప్పుడూ చూడలేదని మత్స్యకారులు చెప్పారు.
విశాఖపట్నం: హుదూద్ పెను తుపాన్ ప్రభావంతో విశాఖపట్నం జిల్లా మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతం సముద్ర కెరటాలు భయంకరంగా ఎగిసిపడుతున్నాయి. తమ జీవితంలో సముద్రాన్ని ఇంత భయంకరంగా ఎప్పుడూ చూడలేదని మత్స్యకారులు చెప్పారు.
అయితే తీర ప్రాంతం నుంచి ఖాళీ చేసేందుకు వారు నిరాకరిస్తున్నారు. లక్షలాది రూపాయలు అప్పు చేసి బోట్లను కొనుగోలు చేశామని, ఇవి దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తమకు మంచినీళ్లు, ఆహారం అందించడంలేదని వాపోయారు. ఈ రాత్రికి పరిస్థితి ఎలా ఉంటుందోనని భయమేస్తుందని సాక్షి ప్రతినిధులతో చెప్పారు. అధికారులు తుపాన్ వచ్చినపుడు హడావుడి చేయడం మినహా తర్వాత తమను ఎవరూ ఆదుకోరని జాలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.