ఒత్తిడితో మతిమరుపు | forgetful With pressure | Sakshi
Sakshi News home page

ఒత్తిడితో మతిమరుపు

Published Wed, Mar 2 2016 11:19 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

ఒత్తిడితో మతిమరుపు - Sakshi

ఒత్తిడితో మతిమరుపు

మానసిక ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే మతిమరుపు తప్పదని వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

పరిపరి  శోధన

మానసిక ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే మతిమరుపు తప్పదని వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి అరుదుగా ఎదురయ్యే మానసిక ఆందోళన, ఒత్తిడి వల్ల పెద్దగా అనర్థాలేమీ ఉండకపోయినా, దీర్ఘకాలికంగా అదే పరిస్థితి కొనసాగుతుంటే మెదడులోని ‘హిప్పోక్యాంపస్’ భాగంలో మార్పులు తలెత్తి, జ్ఞాపకశక్తి క్రమంగా క్షీణిస్తుందని ఓహయో స్టేట్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

ఎలుకలపై నిర్వహించిన పరిశోధనల్లో తాము ఈ విషయాన్ని గుర్తించామని అంటున్నారు. దీర్ఘకాలం పాటు కొన్ని ఎలుకలను ఒత్తిడికి గురిచేసి, వాటి మెదడు పనితీరులో వచ్చిన మార్పులను అధ్యయనం చేసిన ఈ పరిశోధకులు తమ పరిశోధన వివరాలను ‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్’లో ప్రచురించారు.
 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement