మీ దుఃఖానికి కారణం మీరేనా? | Are you the cause of your mourning? | Sakshi
Sakshi News home page

మీ దుఃఖానికి కారణం మీరేనా?

Published Wed, Sep 6 2017 12:34 AM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

మీ దుఃఖానికి కారణం మీరేనా?

మీ దుఃఖానికి కారణం మీరేనా?

సెల్ఫ్‌చెక్‌

మానసికంగా, శారీరకంగా బలంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. మీప్రవర్తనే మీలో ఆనందాన్నైనా, దుఃఖాన్నైనా కలిగిస్తుంది. ఇతరులని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. దీని ద్వారానే అపోహలైనా, కలహాలైనా, మంచి సంబంధాలైనా కలుగుతాయి. వివిధ రకాల ప్రవర్తనలు మీలో సంతోషాన్ని నింపుతున్నాయా? ఆందోళనను కలిగిస్తున్నాయా? ఈ సెల్ఫ్‌చెక్‌ ద్వారా మీ భావాలను తెలుసుకోండి.

1.    ఎవరైనా మిమ్మల్ని అభినందిస్తే చాలా తేలికగా తీసుకొని పెద్దగా స్పందించరు.
    ఎ. అవును      బి. కాదు  

2.    స్నేహితులు మీ పర్సనల్‌ విషయాల్లో జోక్యం చేసుకుంటే వ్యతిరేకిస్తారు.
    ఎ. అవును      బి. కాదు
 
3.    నిరాశావాదం మిమ్మల్ని వెంటాడుతోంది.
    ఎ. అవును      బి. కాదు
 
4.    తప్పు జరిగిందని గ్రహించినా మళ్లీ అలాంటి పొరపాటునే చేస్తుంటారు.
    ఎ. అవును      బి. కాదు  

5.    మీకెవరైనా గిఫ్ట్‌ ఇస్తే చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు.
    ఎ. అవును      బి. కాదు

6.    ఖరీదైన వస్తువులు కొన్నప్పుడు చాలా దిగులు చెందుతారు.
    ఎ. అవును      బి. కాదు  

7.    మీకు రావలసిన ప్రొమోషన్‌ రాకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు.
    ఎ. అవును      బి. కాదు  

8.    అర్థంలేని అనుమానాలు, అపోహలు మిమ్మల్ని వేధిస్తుంటాయి.
    ఎ. అవును      బి. కాదు  

9.    పార్టీలో మీపై సూప్‌ పడితే పెద్ద అవమానంగా భావిస్తారు.
    ఎ. అవును      బి. కాదు  

10.    సమాజంలో చాలామంది మంచివారు కారని మీ విశ్వాసం.
    ఎ. అవును      బి. కాదు  

‘ఎ’ సమాధానాలు 7 దాటితే మీ ఆలోచనలతో మీకై మీరే అసంతృప్తిని, దుఃఖాన్ని కలిగించుకుంటున్నారని అర్థం. ఎప్పుడూ దిగాలుగా, నిరాశావాదంతో, అభద్రతలో ఉండిపోతారు. ఇలాంటి ఆలోచనలను, ప్రవర్తనను వదిలిపెట్టాలి. ‘బి’ సమాధానాలు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారని అర్థం. నెగెటివ్‌ ఆలోచనలకు దూరంగా, పదిమందితో కలిసిపోయి హాయిగా ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement