మాజీ ఎమ్మెల్యే నాడగౌడ
సింధనూరు టౌన్ :తుంగభద్ర ఎడమ కాలువకు నీటిని వదిలే విషయంపై నిర్ణయాన్ని డివిజనల్ కమిషనర్ తీసుకోవాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే హంపనగౌడ్ అసహాయకమైన వ్యాఖ్యలు చేయ డం హాస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే వెంకటరావు నాడగౌడ పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎమ్మెల్యేనే స్వయంగా రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. నీటి సరఫరా నిలిపి వేసే విషయంపై తాము అధికారులను ప్రశ్నిస్తే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారన్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో తగినంత నీరు నిల్వ ఉందని, అందువల్ల నెలలో 10 రోజుల పాటు ఎడమ కాలువకు నీటి సరఫరాని నిలిపి వేయరాదన్నారు.
కాలువకు నీటి సరఫరా నిలిపివేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని, అందువల్ల ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి కాలువకు నిరంతరంగా నీరు వదిలేలా చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. కాలువకు నిరంతరం గా నీటి ని సరఫరా చేయకుంటే రైతులతో కలిసి ఈనెల 18న సింధనూరులో రాస్తారోకో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈసందర్భంగా జేడీఎస్ అధ్యక్షుడు లింగప్ప దడేసూగూరు, నగర శాఖ అధ్యక్షుడు జహీరుల్లా హసన్, ప్రముఖులు ధర్మనగౌడ, సత్యనారాయణ, బసవరాజ నాడగౌడ, వెంకోబ కలూ ్లరు, సత్యనారాయణ, తిమ్మారెడ్డి, సుమిత్ తడకల్, వీరేష్ హట్టి తదితరులు పాల్గొన్నారు.