ఎండ..ఠండా | heavy summer in hyderbad | Sakshi
Sakshi News home page

ఎండ..ఠండా

Published Mon, Apr 18 2016 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

ఎండ..ఠండా

ఎండ..ఠండా

సిటీబ్యూరో: ఉదయం, మధ్యాహ్నం మండుటెండ... ఉక్కపోత..సాయంత్రం ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన జల్లులు. నగరంలో ఆదివారం సాధారణం కంటే భిన్నమైన వాతావరణం ఏర్పడింది. మండుటెండతో విలవిల్లాడిన సిటీజనులు జల్లులతో స్వల్ప ఉపశమనం పొందారు.

కాగా మధ్యాహ్నం గరిష్టంగా 42.2 డిగ్రీలు, కనిష్టంగా 28.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసినట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశాలున్నాయన్నారు.  ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని   ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement