ప్రయాణం | Travel | Sakshi
Sakshi News home page

ప్రయాణం

Published Fri, Apr 3 2015 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

ప్రయాణం

ప్రయాణం

ఆ సాయంకాలపు  ఆఖరి ఎండ  దూరంగా రైలు పట్టాల వద్ద నీడల్తో కలిసి మలుపు తిరుగుతున్నప్పుడు
 ఊరి చివరి  ఆ చిన్న రైల్వేప్లాట్‌ఫాం మీద  అమోఘమైన ఒంటరితనం  హఠాత్తుగా కలిగించిన  ఉత్సాహవంతమైన దిగులను
 నువ్వు అనుభవిస్తున్నప్పుడు  నిన్ను పలకరించిన  ప్రత్యేకమైన ఆ గాలిస్పర్శను  బాగా గుర్తు పెట్టుకో.
 
 ఎందుకంటే  ‘అతడు భూమ్మీద పడీ పడగానే  మొదటిసారీ- ఇదిగో చాలా ఏళ్ల తర్వాత  ఈ సాయంత్రం రెండోసారీ-  జీవితపు అరుదైనరంగు  అతడి హృదయంలో విచ్చుకుంటోన్న సమయంలో  పలకరించాను.  భవిష్యత్‌లో  ఆ స్థితి మళ్లీ అతడికి  సంప్రాప్తిస్తే మూడోసారైనా నన్ను గుర్తు పడతాడో లేదో చూడాలి’  అంటూ  నిన్ను తాకివెళ్లిన గాలి  బాగా చీకటి పడ్డాక  రాత్రితో చెప్పడం
 నక్షత్రాలు విన్నాయి....  - భగవంతం
 9399328997
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement