Breakthrough
-
జీ20 సమ్మిట్: ఉక్రెయిన్ యుద్ధంపై ఏమని తీర్మానించారంటే..
ఢిల్లీ: ఉక్రెయిన్‌లో శాశ్వతమైన శాంతి నెలకొనాలనే తీర్మానాన్ని జీ20 సమ్మిట్ ఆమోదించింది. ప్రస్తుత కాలం యుద్ధాల యుగం కాదని రష్యా పేరు ఎత్తకుండానే సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇతర దేశాల భూభాగాల దురాక్రమణ, అణ్వాయుధాల ముప్పు ఉండకూడదని సభ్య దేశాలు కోరాయి. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సభ్య దేశాలు ఇండోనేషియా బాలీలో జరిగిన తీర్మానాన్ని పునరుద్ఘాచించాయి. ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రపంచ దేశాలు నడుచుకోవాలని పిలుపునిచ్చాయి. అణ్వాయుధ ప్రయోగాల ముప్పు ఉండకూడదని కోరాయి. #WATCH | G 20 in India | " Strong connectivity and infrastructure base of development of human civilization. India has given highest priority to this topic...we believe connectivity between different countries increases not only business but trust between them...by promoting… pic.twitter.com/hNiqXSL0Me — ANI (@ANI) September 9, 2023 జీ20 ప్రధానంగా అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి వేదిక. అయినప్పటికీ ఆర్ధిక వ్యవస్థల్ని దెబ్బతీసే పర్యావరణ, భౌగోళిక, రాజకీయ అంశాలపై కూడా చర్చిస్తారు. వాటిని ఎదుర్కొనడానికి తీర్మానాలను రూపొందించి ఆమోదం తెలుపుతారు. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్నే ప్రధానంగా చర్చించారు. ప్రపంచ ఆహార, ఇందన భద్రత, సరఫరా గొలుసులు, ద్రవ్యోల్బణంపై యుద్ధం ప్రభావం చూపుతోందని తీర్మానించారు. కరోనా సృష్టించిన ఆర్థిక విపత్తు నుంచి కోలుకుంటున్న దేశాలను ఉక్రెయిన్ యుద్ధం కష్టకాలంలోకి నెట్టేసిందని అభిప్రాయపడ్డారు. PM Modi announces adoption of G20 Leaders’ Summit Declaration Read @ANI Story | https://t.co/UyjLby7Rvn#PMModi #NarendraModi #G20India2023 #G20SummitDelhi pic.twitter.com/VMxKR5saED — ANI Digital (@ani_digital) September 9, 2023 రష్యా, ఉక్రెయిన్ నుంచి ముడి పదార్థాలను ఎటువంటి అడ్డుంకులు లేకుండా సరఫరా చేయాలని జీ20 సమ్మిట్ పిలుపునిచ్చింది. సంక్షోభాలకు శాంతియుత పరిష్కారాలు, దౌత్యం, చర్చలు చాలా ముఖ్యమైనవని ఈ డిక్లరేషన్ అభిప్రాయపడింది. ఇదీ చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే.. -
ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో సంచలనం
పరిశోధకులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ప్రయోగం ఫలించింది. ఒక రోగికి తాత్కాలికంగా పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. ప్రపంచంలోనే తొలిసారిగా న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్‌లో ఆసుపత్రిలో ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించారు. వైద్యులు ఈ కొత్త ప్రయోగం విశేషంగా నిలుస్తోంది. ఈ సక్సెస్‌తో పంది గుండెను మనిషికి అమర్చే తరుణం కూడా దగ్గరలోనే ఉందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. కోతినుంచి ఆవిర్భవించిన మనిషి మిగిలిన జంతువులతో కూడా చాలా దగ్గర పోలికలున్నట్టు కనిపిస్తోంది. తాజాగ ప్రపంచంలో తొలిసారిగా పంది మూత్రపిండాన్ని మనిషికి మార్పిడి చేశారు. అవయవాల కొరతతో ఇబ్బందులుపడుతున్న తరుణంలో ఇది పెద్ద ముందడుగని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన మహిళా రోగికి కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. కానీ ఆమెకు మూత్ర పిండాన్ని దానం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఆమోదంతో వైద్యులు ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టారు. గత కొన్ని దశాబ్దాల పరిశోధనల నేపథ్యంలో ఆమెకు పంది కిడ్నీని అమర్చేందుకు నిర్ణయించారు. మూడు రోజుల పాటు, కొత్త కిడ్నీని ఆమె రక్తనాళాలకు జతచేశారు. మార్పిడి చేసిన మూత్ర పిండాల పనితీరు, పరీక్షఫలితాలు చాలా మెరుగ్గా కనిపించాయని దీనికి నాయకత్వం వహించిన వైద్యుడు డాక్టర్ రాబర్ట్ మోంట్ గోమేరీ తెలిపారు. ఈ ప్రయోగ ఫలితంగా అవయవ మార్పిపై కొత్త ఆశలు చిగురించాయి. జెనోట్రాన్స్ప్లాంటేషన్ కల సాకారంలో ఇదొక కీలక అడుగు అని యునైటెడ్ థెరప్యూటిక్స్ సీఈవో మార్టిన్ రోత్‌బ్లాట్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాదు భవిష్యత్తులో ప్రతి ఏడాది వేలాదిమంది ప్రాణాలను కాపాడే సమయం ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. జన్యుపరంగా మార్పు చెందిన పందిని గాల్‌సేఫ్ అని పిలుస్తారు. దీనిని యునైటెడ్ థెరప్యూటిక్స్ కార్పొరేషన్‌కు చెందిన రివైవికర్ యూనిట్ అభివృద్ధి చేసింది. మాంసం అలెర్జీ ఉన్నవారికి ఆహారంగా, మానవ చికిత్సా సంభావ్య వనరుగా ఉపయోగించడం కోసం దీనిని డిసెంబర్ 2020లో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. మానవ రోగులకు గుండె కవాటాల నుండి చర్మ అంటుకట్టుట వరకు గాల్సేఫ్పందులు అన్నింటికి పరిష్కరంగా ఉంటాయని అందుకు పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు. ఈ మూత్రపిండ మార్పిడి ప్రయోగం ఎండ్-స్టేజ్ కిడ్నీఫెయిల్యూర్ ఉన్న రోగులలో, వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో ట్రయల్స్‌కు మార్గం సుగమం చేయాలని, స్వయంగా గుండె మార్పిడి గ్రహీత అయిన మోంట్గోమేరీ అన్నారు. జంతువుల అవయవాలను మార్పిడి అవకాశంపై దశాబ్దాలుగా కృషి జరుగుతోంది. పంది గుండె ఆకారంలోనూ, నిర్మాణంలోనూ మనిషి గుండెను పోలి ఉంటుందని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే 2022 కల్లా వరాహం గుండెను మనిషికి అమర్చే ప్రయోగాలు సక్సెస్ అవుతాయని ప్రఖ్యాత వైద్యుడు సర్ టెరెన్స్ గతంలోనే ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పంది మూత్రపిండం మనిషికి మార్చే అవకాశంపై కూడా ఈయన చర్చించారు. ఒకవేళ మనిషికి పంది మూత్రపిండం మార్చడం సాధ్యపడితే గుండెను కూడా మార్చటం సాధ్యమేనని ఆయన స్పష్టం చేశారు. యూకేలో గుండె మార్పిడి చికిత్సలకు పేరుగాంచిన టెరెన్స్ 40 ఏళ్ల క్రితమే మొట్టమొదటి గుండె మార్పిడి చికిత్స చేయడం విశేషం. కాగా భారతదేశంలో మొట్టమొదటి మానవ మూత్రపిండ మార్పిడి 1965లో బొంబాయిలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో జరిగింది. అయితే విజయవంతమైన తొలి మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో జరిగిందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. 1971 ఫిబ్రవరి 2న షణ్ముగం అనే రోగికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి వైద్యులు తొలి విజయాన్ని నమోదు చేశారు. అమెరికాలో దాదాపు 1,07,000 మంది ప్రస్తుతం అవయవ మార్పిడి కోసం వేచి చూస్తున్నారని ఒక నివేదిక తెలిపింది. ఇందులో 90వేలకు పైగా రోగులు కిడ్నీ కోసం ఎదురుచూస్తుండగా, రోజుకు 12 మంది చని పోతున్నారు. భారతదేశంలో కిడ్నీ సంబధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా అవయవాల మార్పిడికి ఆర్గాన్స్ అందుబాటులో లేక దాదాపు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా 2 లక్షల మందికి పైగా రోగులు కిడ్నీ మార్పిడి చేయించు కుంటున్నారు. అలాగే లక్షా యాభై వేల మంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్‌కు ఎదురు చూస్తున్నారట. ముఖ్యంగా అవయవ దానంపై అవగాహన లేక పోవడం, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఈ ఆర్గాన్ డొనేషన్‌కి ముందుకు రాకపోవడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. -
బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్కు భయపడాలా..?
టీకా తీసుకుంటే కరోనాకు ‘మత్ డరోనా’ అనుకుంటూ వచ్చింది ప్రపంచం. కానీ ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు వస్తోంది. టీకా రెండు డోసులు పుచ్చుకున్నా సరే కరోనా రావచ్చంటున్నాయి తాజా పరిశోధనలు. ఇలా వచ్చే ఇన్ఫెక్షన్ను బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ అంటారు. డెల్టా వేరియంట్ దెబ్బకు టీకాల ప్రభావం క్షీణిస్తోందని, అందుకే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్లు ఎక్కువైతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అసలీ వార్తలు నిజమేనా? నిజమైతే ఎంతవరకు డేంజర్? టీకా తీసుకున్నా కరోనా సోకేట్లయితే ఎందుకు టీకా తీసుకోవడం? తదితర అంశాలపై జరిగిన పరిశోధనల వివరాలపై ఒక లుక్కేద్దాం! ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ కూడా 100 శాతం ప్రభావవంతం కాదు. పోలియోను నిరోధించే సాక్ వ్యాక్సిన్ సైతం 80–90 శాతం మాత్రమే ఎఫెక్టివ్. మీజిల్స్‌కు ఇచ్చే టీకా 94 శాతం మాత్రమే ప్రభావశీలి. ఈ గణాంకాల ప్రకారం చూస్తే దాదాపు 95 శాతం ప్రభావం చూపుతున్న మోదెర్నా, ఫైజర్ రూపొందించిన ఎంఆర్ఎన్ఏ కరోనా టీకాలు బాగానే పని చేస్తున్నట్లు లెక్క. ఒక టీకా 95 శాతం ప్రభావశాలి అంటే 100మంది జనాభాలో 95 మందిని టీకా రక్షిస్తుంది, ఐదుగురికి మాత్రమే వైరస్ సోకుతుందని కాదని నిపుణులు వివరిస్తున్నారు. 95 శాతం ప్రభావశాలి అంటే ఒక నిర్ణీత సమూహంలో టీకా తీసుకున్నవారిని, టీకా తీసుకోనివారిని పోల్చిచూసి టీకా ప్రభావాన్ని లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక టీకా ప్రభావశాలిత్వం 95 శాతమంటే, నిర్ణీత కాలంలో 10 వేల మంది జనాభాలో 100మంది టీకా తీసుకోనివారికి వైరస్ సోకిందంటే వారిలో ఐదుగురు టీకా తీసుకున్నవారు కూడా ఉన్నారని అర్దం. ఇలా టీకా తీసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్ వస్తే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే టీకా ఇచ్చిన రక్షణ కవచాలను ఛేదించుకొని మరీ వైరస్ సోకిందన్నమాట! అందరికీ వస్తుందా? ఇతర వ్యాధులతో పోలిస్తే కరోనా విషయంలో బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఇలాంటి బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్కు గురైన వారిలో వ్యాధి తీవ్రత, లక్షణాలు స్వల్పంగా లేదా అసలు కనిపించకుండానే ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఉదాహరణకు జనవరి– ఏప్రిల్ కాలంలో యూఎస్‌లో సుమారు 1.2 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా వీటిలో బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్ సంఖ్య 10, 262ని సీడీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మే నుంచి కేవలం ఆస్పత్రి పాలైనవారు లేదా మరణించినవారివి తప్ప సాధారణ బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్ గణాంకాల సేకరణను సీడీసీ నిలిపివేసింది. జూలై 19నాటికి ఇలాంటి కేసులు సంఖ్య సుమారు 6వేలుంది. ఇదే సమయానికి దేశంలో టీకా తీసుకున్నవారు సుమారు 16 కోట్లు. ఫైజర్, మోదెర్నా టీకాల విషయంలో బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్ సంఖ్య 0.16 శాతముంది. దీన్ని బట్టి బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్ చాలా అసాధారణమని తెలుస్తోంది. ఎంత సీరియస్? ఒక వ్యక్తి నిర్ధేశిత టీకా డోసులు పూర్తి చేసిన 14 రోజుల అనంతరం అతనికి కరోనా పాజిటివ్ వస్తే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్గా భావించాలని సీడీసీ పేర్కొంది. సీడీసీ లెక్కల ప్రకారం మొత్తం బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్లో 27 శాతం కేసుల్లో లక్షణాలే కనిపించలేదు. 10 శాతం మంది కరోనాతో పాటు ఇతర సమస్యలతో ఆస్పత్రి పాలయ్యారు. కేవలం 2 శాతం మందిమాత్రమే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ తర్వాత మరణించారు. ఇతర అధ్యయనాల్లో సైతం బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ వల్ల మరణాలు సంభవించలేదనే తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్ చాలావరకు డేంజర్ కాదనే నిపుణులు చెబుతున్నారు. ఎవరికి రావచ్చు? అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మాములు కరోనా కేసులు ఎక్కువగా ఉండే చోట్లనే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ కేసులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సామూహికంగా గుమిగూడే ప్రదేశాలను సందర్శించేవారు, కిక్కిరిసిన సమూహంలో పనిచేయాల్సివచ్చినవారు, కరోనా పేషెంట్లతో ఎక్కువ కాలం గడిపే హెల్త్‌లైన్ వర్కర్లు, 65ఏళ్ల పైబడినవారు, బీపీ, షుగర్, హృద్రోగాలు, కిడ్నీవ్యాధుల్లాంటి వాటితో బాధపడేవారు, అవయవమార్పిడి జరిగినవారిలో బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్ అధికమని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని పరిశోధనల ప్రకారం పురుషుల కన్నా మహిళల్లో ఈ బ్రేక్‌థ్రూ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై మరింత పరిశోధన జరగాల్సిఉంది. డెల్టా వేరియంట్ ప్రభావమేంటి? ప్రస్తుతమున్న కరోనా టీకాలు చాలావరకు తొలిదశ వేరియంట్ల భరతం పట్టేందుకు ఉద్దేశించినవి. అయితే కాలక్రమంలో కొత్త వేరియంట్లు కనిపించినా టీకాల వల్ల పెరిగిన యాంటీబాడీలు ఈ వేరియంట్లను కూడా బాగానే అడ్డుకున్నాయి. అయితే డెల్టా వేరియంట్ రంగప్రవేశంతో సీను మారింది. ఈ వేరియంట్ కారణంగా తీవ్రమైన అనారోగ్యం బారిన పడకుండా ప్రస్తుత టీకాలు కాపాడుతున్నా, పాత వేరియంట్లతో పోలిస్తే దీనిపై ప్రభావం తక్కువగానే ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. ఉదాహరణకు ఎంఆర్ఎన్ఏ రెండు డోసులు తీసుకుంటే ఆల్ఫావేరియంట్పై 89% ప్రభావం చూపగా, డెల్టాపై 79% ప్రభావమే కనిపించిందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ తెలిపింది. కానీ, డెలా ్టకారణంగా ఆస్పత్రి పాలు కాకుండా మాత్రం టీకాలన్నీ బాగానే ప్రభావం చూపుతున్నాయి. టీకా తీసుకోవాలా? అమెరికా సహా పలు దేశాల్లో దాదాపు 35–50 శాతం జనాభా టీకాలు తీసుకున్నారు. అలాగే వయోవృద్ధుల్లో చాలామందికి టీకాలందాయి. వీరందరిలో అత్యధికులను చావు నుంచి తీవ్ర అనారోగ్యం నుంచి టీకా కాపాడినట్లు పరిశోధనలు తెలిపాయి. ఉదాహరణకు ఇజ్రాయెల్‌లో టీకాల వల్ల ఆస్పత్రిపాలవడం 68 శాతం మేర తగ్గింది. గత మేలో అమెరికాలో కరోనా కారణంగా సంభవించిన మరణాలు 18,000కాగా వీటిలో టీకా తీసుకున్నవారి సంఖ్య 150. అంటే చాలావరకు కరోనా మరణాలు టీకా తీసుకోనివారిలోనే సంభవించినట్లు తెలుస్తోంది. టీకా తీసుకోనివారు కరోనాకు చెందిన ఏ వేరియంట్ బారినైనా పడొచ్చని, తద్వారా తీవ్ర అనారోగ్యమో, మరణమో సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల తప్పక టీకాలు తీసుకోవడం మంచిదన్నది నిపుణులందరి మాట! – నేషనల్ డెస్క్, సాక్షి -
ఏలియన్స్, నక్షత్రాలను చేరుకునేందుకు..
న్యూయార్క్: ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ రష్యా బిలియనీర్ యూరీ మిల్నర్, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకర్బర్గ్లతో కలిసి నక్షత్ర యానం చేసే చిన్న స్పేస్‌క్రాఫ్ట్‌లను తయారుచేసేందుకు 100 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుకు పూనుకున్నారు. ఈ విషయాన్ని హాకింగ్స్, మిల్నర్‌లు వన్ వరల్డ్ అబ్జర్వేటరీ ఇన్ న్యూయార్క్‌లో ప్రకటించారు. తక్కువ సమయంలో.. 'బ్రేక్ త్రూ స్టార్ షాట్' పేరుతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో కాంతి వేగానికి 20 రెట్లు ఎక్కువగా ప్రయాణించగల నానోక్రాఫ్ట్లను ( ప్రస్తుత స్పేస్‌క్రాఫ్ట్‌లతో పోల్చితే 1,000 రెట్లు వేగంగా ప్రయాణించగలవు) తయారుచేయనున్నారు. నానోక్రాఫ్ట్లు నిర్మించడం పూర్తయిన తర్వాత ఇవి ఆల్ఫా సెంటౌరీ (భూమికి 4.37 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం) ని చేరుకోగలదని, ఇందుకు 20 సంవత్సరాల కాలం పడుతుందని మిల్నర్ తెలిపారు. సాధారణ స్పేస్ క్రాఫ్ట్‌లు ఈ దూరాన్ని పూర్తి చేయడానికి 30,000 సంవత్సరాలకు పైచిలుకు సమయం పడుతుంది. చిన్న భాగాలతో.. మొత్తం రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అందుబాటులో ఈ నానోక్రాఫ్ట్ల్లో ప్రధానంగా రెండు భాగాలుంటాయి. 1. కంప్యూటర్ సీపీయూ సైజ్‌లో ఉండే 'స్టార్ చిప్' 2. మెటామెటీరియల్‌తో రూపొందించిన 'లైట్సెయిల్' ఇందులో కేవలం కొన్ని వందల ఆటమ్స్ మందంగా ఉంటాయి. కొన్ని గ్రాముల బరువు మాత్రమే ఉండే స్టార్చిప్లో విశ్వ పరిశోధనకు అవసరమైన కెమెరాలు, నావిగేషన్, సమాచార సాధనాలు ఇమిడి ఉంటాయి. స్టార్చిప్లను ఐ-ఫోన్ ఖరీదులోనే ఒకేసారి తయారు చేసుకోవచ్చని మిల్నర్ వివరించారు. ఏలియన్ల వెతుకులాటకు.. సాధనాలను శక్తిమంతమైన లేజర్ సాయంతో విశ్వ ప్రయాణానికి పంపుతామని, ఇందుకు 100 గిగావాట్ల పవర్‌ను ఉపయోగిస్తామని న్యూస్కాన్ఫరెన్స్ పేనెలిస్ట్ లోఏబ్ తెలిపారు. వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 'పదిహేను ఏళ్ల కిందట ఇటువంటి ప్రయోగాలు చేయడంపై పెట్టుబడి పెట్టడం అర్ధం లేదని కానీ, ఇప్పుటి పరిస్థితులు వేరు' అని మిల్నర్ అన్నారు. గత ఏడాది జులై 2015లో మిల్నర్, హాకింగ్స్లు పాలపుంతకు దగ్గరగా ఉన్న 100 గెలాక్సీల్లో ఏలియన్లను వెతకడానికి ప్రారంభించిన ప్రాజెక్టు కూడా బ్రేక్ త్రూలో ఒక భాగం. 'భూమ్యకర్షణ శక్తి మనల్ని కిందే ఉండేలా చేస్తుంది. కానీ, నేను అమెరికాకు ఎగురుకుంటూ వెళ్లగలిగాను.' అని హాకింగ్స్ పేర్కొన్నారు. 'ఆల్ఫా సెంటౌరీని చేరుకోవడం ఒక్కటే మా లక్ష్యం కాదు. ఆ మార్గంలో మేం ఎదుర్కొనే సవాళ్లు కూడా మా లక్ష్యమే. ఇందులో చాలా పెద్ద మొత్తంలో సైన్స్‌ను తెలుసుకోబోతున్నాం' అని జెమీసన్ అన్నారు. 'ఈ రోజు మనిషి మొదటిసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన రోజు. ఇదే రోజున మేం మరో పెద్ద కార్యాన్ని తలపెడుతున్నాం' అని హాకింగ్స్ అన్నారు. -
ప్రయాణం
ఆ సాయంకాలపు ఆఖరి ఎండ దూరంగా రైలు పట్టాల వద్ద నీడల్తో కలిసి మలుపు తిరుగుతున్నప్పుడు ఊరి చివరి ఆ చిన్న రైల్వేప్లాట్‌ఫాం మీద అమోఘమైన ఒంటరితనం హఠాత్తుగా కలిగించిన ఉత్సాహవంతమైన దిగులను నువ్వు అనుభవిస్తున్నప్పుడు నిన్ను పలకరించిన ప్రత్యేకమైన ఆ గాలిస్పర్శను బాగా గుర్తు పెట్టుకో. ఎందుకంటే ‘అతడు భూమ్మీద పడీ పడగానే మొదటిసారీ- ఇదిగో చాలా ఏళ్ల తర్వాత ఈ సాయంత్రం రెండోసారీ- జీవితపు అరుదైనరంగు అతడి హృదయంలో విచ్చుకుంటోన్న సమయంలో పలకరించాను. భవిష్యత్‌లో ఆ స్థితి మళ్లీ అతడికి సంప్రాప్తిస్తే మూడోసారైనా నన్ను గుర్తు పడతాడో లేదో చూడాలి’ అంటూ నిన్ను తాకివెళ్లిన గాలి బాగా చీకటి పడ్డాక రాత్రితో చెప్పడం నక్షత్రాలు విన్నాయి.... - భగవంతం 9399328997 -
ఆడశిశువుల్ని ఆదరించండి!
సగటున వెయ్యిమంది అబ్బాయిలుంటే అమ్మాయిలు మరో యాభైమంది ఎక్కువగా ఉండాలి. కానీ, హర్యానాలో వెయ్యిమంది అబ్బాయిలకు 830 మంది అమ్మాయిలున్నారు. పోను పోనూ అమ్మాయిల సంఖ్య ఇంకా తగ్గిపోతోంది. కారణం... భ్రూణహత్యలు. ఆడశిశువనగానే పురిట్లోనే ప్రాణం తీసేవారి కారణంగా అమ్మాయిల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. ఇది అందరినీ ఆలోచనలో పడేసే సమస్యే అయినా ఎవరూ పట్టించుకోని విషయంగా మారిందక్కడ. బ్రేక్‌త్రూ’ అనే స్వచ్ఛంద సంస్థ అక్కడ అమ్మాయిల సంఖ్యను పెంచడం కోసం చాన్నాళ్ల నుంచి కృషి చేస్తోంది. ప్రభుత్వంతో కలిసి బోలెడన్ని కార్యక్రమాలు చేసి ప్రజల కళ్లు తెరిపించే పనిచేసింది. ఏం లాభం...ఆడపిల్లల సంఖ్య పెరగడం లేదు. ఇక లాభం లేదని వీధి నాటకాలను మార్గంగా ఎంచుకుంది. ఇంటింటికీ తిరిగి చెప్పినా విషయం ఒంటబట్టనివారికి నాటకం కళ్లు తెరిపిస్తుందేమోనని ఓ ప్రయత్నం చేశారు. రంగస్థల కళాకారుల సహకారంతో బస్టాపుల్లో, రచ్చబండల దగ్గర, స్కూలు కాంపౌండ్లలో, కాలేజీ గేటు దగ్గర, కిరాణా షాపుల ముందర...ఎక్కడ నలుగురూ చేరతారో ఆ ప్రదేశాన్నే వేదికగా చేసుకుని ‘బ్రేక్‌త్రూ’ సంస్థ నాటకాల ప్రదర్శన ఏర్పాటు చేయసాగింది. ఆడశిశువుల్ని ఆదరించాలంటూ ఆలోచన రేపింది. నాలుగు జిల్లాల్లో... జజ్జర్, సోనేపట్, పానిపట్, రోహ్తక్ జిల్లాల్లో ఇప్పటివరకూ వందకుపైగా నాటకాల ప్రదర్శన జరిపారు. ఈ స్వచ్ఛందసంస్థకు సాయంగా అంగన్వాడీ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు కూడా ముందుకొచ్చి ప్రజలకు తమ సందేశాలను వినిపించారు. మాటలకన్నా నాటకమే మేలనుకున్న ‘బ్రేక్‌త్రూ’ సంస్థ ఆలోచనకు మంచి స్పందన లభించింది. నాటక ప్రదర్శన పూర్తవ్వగానే తమ చుట్టుపక్కల ఆడపిల్లలకు జరిగిన అన్యాయాల గురించి ప్రజలు చెప్పుకొచ్చిన కథనాలే దానికి నిదర్శనం. అమ్మాయిలు లేకపోతే భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో నాటకరూపంలో చెప్పడంలో రంగస్థల నటులు నూటికి నూరుపాళ్లు విజయం సాధించారని ప్రభుత్వ అధికారులు కూడా ఒప్పుకున్నారు.