నిబంధనలు అతిక్ర మించే పాఠశాలలపై చర్యలు
డీఈవో నాగేశ్వరరావు హెచ్చరిక
చిత్తూరు(గిరింపేట): జిల్లాలో ప్రస్తుతమున్న ఎండ తీవ్రత దృష్ట్యా అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఉదయం 11 వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరగనుందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఆదేశాలను జారీ చేశామని తెలిపారు.
నిబంధనలను అతిక్రమించి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మంగళవారం ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను త నిఖీ చేయడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించామని తెలిపారు. వారు 11 గంటలపై అన్ని పాఠశాలలను తనిఖీ చేస్తార న్నారు. రెండో పేపర్ పరీక్ష ఉన్న తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రం 11 గంటలకుపైన పరీక్షలను రాయించాలన్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే సంబంధిత ప్రదేశాల్లో వున్న ఎంఈవోలకు, డీవైఈఓలకు సమాచారం ఇవ్వాలని కోరారు.