న్యూఢిల్లీ: ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం సాధారణం కంటే ఎక్కువగా 40 డిగ్రీల సెల్సియస్ చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు, వాయవ్య భారతదేశంలో వచ్చే నాలుగు రోజుల్లో వడగాలులు వీసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది.
పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, సిక్కిం, జార్ఖండ్ రాష్ట్రాలతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ల్లో ఈ పరిస్థితులుంటాయని వివరించింది. దక్షిణ భారతంలోని ఏపీ తీరప్రాంతంలో బుధవారం వరకు భానుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం వరుసగా రెండో రోజు సాధారణం కంటే కనీసం 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించింది. బుధవారం నాటికి వాతావరణం కొద్దిగా చల్లబడే అవకాశాలున్నాయంది.
Comments
Please login to add a commentAdd a comment