East India
-
దేశవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండలు
న్యూఢిల్లీ: ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం సాధారణం కంటే ఎక్కువగా 40 డిగ్రీల సెల్సియస్ చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు, వాయవ్య భారతదేశంలో వచ్చే నాలుగు రోజుల్లో వడగాలులు వీసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, సిక్కిం, జార్ఖండ్ రాష్ట్రాలతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ల్లో ఈ పరిస్థితులుంటాయని వివరించింది. దక్షిణ భారతంలోని ఏపీ తీరప్రాంతంలో బుధవారం వరకు భానుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం వరుసగా రెండో రోజు సాధారణం కంటే కనీసం 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించింది. బుధవారం నాటికి వాతావరణం కొద్దిగా చల్లబడే అవకాశాలున్నాయంది. -
11 సబ్డివిజన్లలో లోటు వర్షపాతం
న్యూఢిల్లీ: దేశంలోని 36 వాతావరణ సబ్డివిజన్లలో 11 సబ్డివిజన్లలో ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదైందని భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) తెలిపింది. అలాంటి ప్రాంతాలు ఎక్కువగా తూర్పు, ఈశాన్య భారత్‌లో ఉన్నాయంది. 23 సబ్డివిజన్లు సాధారణ వర్షపాతం పొందాయని, 2 సబ్డివిజన్లలో(కేరళ, కోస్తా ఏపీ) సాధారణం కన్నా అధిక వర్షపాతం కురిసిందని తెలిపింది. లోటువర్షపాతం నమోదైన తూర్పు, ఈశాన్య డివిజన్లలో అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం–మేఘాలయ, నాగాలాండ్–మిజోరాం–త్రిపుర, హిమాలయ బెంగాల్–సిక్కిం, గంగామైదానాల పశ్చిమ బెంగాల్, జార్ఖండ్–బిహార్ ఉన్నాయి. దక్షిణాదిలో రాయలసీమ, ఉత్తర కర్ణాటక, తెలంగాణ సబ్డివిజన్లు ఉన్నాయి. తెలంగాణలో 41 శాతం, లక్ష్యద్వీప్‌లో 44 శాతం లోటు ఏర్పడింది. వరదలతో అతలాకుతలమైన కేరళలో జూన్ 1 నుంచి 41 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. -
మయన్మార్‌లో పెను భూకంపం
-
సేంద్రీయ కేంద్రంగా ఈశాన్య భారత్: మోదీ
ఈటానగర్: ఈశాన్య భారతదేశాన్ని సేంద్రీయ కేంద్రంగా అభివృద్ధి చేసి వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులను పెంచేందుకు కేంద్రం కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన 2జీ, 3జీ, 4జీ సేవలను మెరుగుపరుస్తామని తెలిపారు. ఈటానగర్‌లోని గాంధీ పార్క్‌లో శుక్రవారం జరిగిన 29వ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మోదీ అక్కడి సాంప్రదాయ దుస్తులైన బ్యోప(తలపాగ), పోమో(జాకెట్), జిలాంగ్(శాలువ)ను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ప్రాంతంలో ఆరు వ్యవసాయవర్సిటీలను ఏర్పాటు చేస్తామన్నారు.ఇక్కడ 18 రేడియో చానళ్లను ప్రారంభించడానికి కేంద్రం కసరత్తు చేస్తోందని తెలిపారు. ఇకపై కేంద్ర మంత్రులు నెలకు రెండు సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారన్నారు. కాగా, మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించడంలో, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద ్ధరించడంలో భారత్ చర్య ఏమాత్రం అనుకూలమైనది కాదని పేర్కొంది. -
చెన్నపట్నానికి 375 ఏళ్లు
చెన్నై: దక్షిణాదిలోని నగరాల్లోకెల్లా ప్రముఖ పారిశ్రామిక, వ్యాపార, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతున్న తమిళనాడు రాజధాని చెన్నై శుక్రవారంతో 375వ వసంతంలోకి అడుగుపెట్టింది. 1639 ఆగస్టు 22న ఈ నగరం ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని తమకు అప్పగించేలా నాటి రాజులతో బ్రిటీషర్లు ఒప్పందం కుదుర్చుకోవడంతో నాటి మద్రాస్ ఆవిర్భవించింది. ఆ తర్వాతి ఏడాదే...అంటే 1640లో బ్రిటీషర్లు ఇక్కడ సెయింట్ జార్జి కోటను నిర్మించి తమ ఈస్ట్ ఇండియా కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఈ ప్రాంతం అంచెలంచెలుగా ఎదిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మద్రాస్ డే పేరిట శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నగరానికి సంబంధించి పలు విశేషాలు... ► ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగరి కోటలో మద్రాస్‌ను బ్రిటీషు పాలకులకు అప్పగించే ఒప్పందం కుదిరింది. ► మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1917లో మద్రాస్‌పై ఎండెన్ అనే జర్మనీ నౌక బాంబుల వర్షం కురిపించింది. ► ఆధునిక భారత్‌లోని తొలి నగరం ఇదే. కోల్కతాకన్నా 50ఏళ్ల తర్వాత, ముంబైకన్నా 35 ఏళ్ల తర్వాత మద్రాస్ అభివృద్ధి చెందింది. ► నేటి చెన్నై నగరాన్ని మొట్టమొదట చెన్నప్పనాయకన్ అని పిలిచేవారట. ఆ తర్వాతి కాలంలో అదే చెన్నపట్నంగా, మద్రాస్‌గా మారి చివరకు చెన్నైగా స్థిరపడింది. ► 1996లో నాటి డీఎంకే సర్కారు ఈ నగరం పేరును మద్రాస్ నుంచి చెన్నైగా మార్చారు. ► {పపంచంలోనే రెండో అతిపొడవైన మెరీనా బీచ్ చెన్నైలోనే ఉంది. ► బాలీవుడ్‌కు దీటుగా తమిళ సినీపరిశ్రమ వేళ్లూనుకుంది ఇక్కడే.