ఈటానగర్: ఈశాన్య భారతదేశాన్ని సేంద్రీయ కేంద్రంగా అభివృద్ధి చేసి వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులను పెంచేందుకు కేంద్రం కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన 2జీ, 3జీ, 4జీ సేవలను మెరుగుపరుస్తామని తెలిపారు. ఈటానగర్‌లోని గాంధీ పార్క్‌లో శుక్రవారం జరిగిన 29వ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మోదీ అక్కడి సాంప్రదాయ దుస్తులైన బ్యోప(తలపాగ), పోమో(జాకెట్), జిలాంగ్(శాలువ)ను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ప్రాంతంలో ఆరు వ్యవసాయవర్సిటీలను ఏర్పాటు చేస్తామన్నారు.ఇక్కడ 18 రేడియో చానళ్లను ప్రారంభించడానికి కేంద్రం కసరత్తు చేస్తోందని తెలిపారు. ఇకపై కేంద్ర మంత్రులు నెలకు రెండు సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారన్నారు. కాగా, మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించడంలో, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద ్ధరించడంలో భారత్ చర్య ఏమాత్రం అనుకూలమైనది కాదని పేర్కొంది.
సేంద్రీయ కేంద్రంగా ఈశాన్య భారత్: మోదీ
Published Sat, Feb 21 2015 1:27 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement