చెన్నపట్నానికి 375 ఏళ్లు
చెన్నై: దక్షిణాదిలోని నగరాల్లోకెల్లా ప్రముఖ పారిశ్రామిక, వ్యాపార, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతున్న తమిళనాడు రాజధాని చెన్నై శుక్రవారంతో 375వ వసంతంలోకి అడుగుపెట్టింది. 1639 ఆగస్టు 22న ఈ నగరం ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని తమకు అప్పగించేలా నాటి రాజులతో బ్రిటీషర్లు ఒప్పందం కుదుర్చుకోవడంతో నాటి మద్రాస్ ఆవిర్భవించింది. ఆ తర్వాతి ఏడాదే...అంటే 1640లో బ్రిటీషర్లు ఇక్కడ సెయింట్ జార్జి కోటను నిర్మించి తమ ఈస్ట్ ఇండియా కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఈ ప్రాంతం అంచెలంచెలుగా ఎదిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మద్రాస్ డే పేరిట శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నగరానికి సంబంధించి పలు విశేషాలు...
► ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగరి కోటలో మద్రాస్‌ను బ్రిటీషు పాలకులకు అప్పగించే ఒప్పందం కుదిరింది.
► మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1917లో మద్రాస్‌పై ఎండెన్ అనే జర్మనీ నౌక బాంబుల వర్షం కురిపించింది.
► ఆధునిక భారత్‌లోని తొలి నగరం ఇదే. కోల్‌కతాకన్నా 50ఏళ్ల తర్వాత, ముంబైకన్నా 35 ఏళ్ల తర్వాత మద్రాస్ అభివృద్ధి చెందింది.
► నేటి చెన్నై నగరాన్ని మొట్టమొదట చెన్నప్పనాయకన్ అని పిలిచేవారట. ఆ తర్వాతి కాలంలో అదే చెన్నపట్నంగా, మద్రాస్‌గా మారి చివరకు చెన్నైగా స్థిరపడింది.
► 1996లో నాటి డీఎంకే సర్కారు ఈ నగరం పేరును మద్రాస్ నుంచి చెన్నైగా మార్చారు.
► {పపంచంలోనే రెండో అతిపొడవైన మెరీనా బీచ్ చెన్నైలోనే ఉంది.
► బాలీవుడ్‌కు దీటుగా తమిళ సినీపరిశ్రమ వేళ్లూనుకుంది ఇక్కడే.