
గత వారం రోజుల ఉపగ్రహ సమాచారాన్ని క్రోడీకరించి భారతదేశంలో వర్షపాతం వివరాలతో తాజాగా నాసా విడుదల చేసిన వీడియో దృశ్యమిది. ఈ మ్యాప్‌లో కేరళపై అత్యంత దట్టంగా కమ్ముకున్న మేఘాలను చూడొచ్చు.
న్యూఢిల్లీ: దేశంలోని 36 వాతావరణ సబ్‌డివిజన్లలో 11 సబ్‌డివిజన్లలో ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదైందని భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) తెలిపింది. అలాంటి ప్రాంతాలు ఎక్కువగా తూర్పు, ఈశాన్య భారత్‌లో ఉన్నాయంది. 23 సబ్‌డివిజన్లు సాధారణ వర్షపాతం పొందాయని, 2 సబ్‌డివిజన్లలో(కేరళ, కోస్తా ఏపీ) సాధారణం కన్నా అధిక వర్షపాతం కురిసిందని తెలిపింది. లోటువర్షపాతం నమోదైన తూర్పు, ఈశాన్య డివిజన్లలో అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం–మేఘాలయ, నాగాలాండ్–మిజోరాం–త్రిపుర, హిమాలయ బెంగాల్–సిక్కిం, గంగామైదానాల పశ్చిమ బెంగాల్, జార్ఖండ్–బిహార్ ఉన్నాయి. దక్షిణాదిలో రాయలసీమ, ఉత్తర కర్ణాటక, తెలంగాణ సబ్‌డివిజన్లు ఉన్నాయి. తెలంగాణలో 41 శాతం, లక్ష్యద్వీప్‌లో 44 శాతం లోటు ఏర్పడింది. వరదలతో అతలాకుతలమైన కేరళలో జూన్ 1 నుంచి 41 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment