న్యూఢిల్లీ: భారత్‌లోని 25 శాతం భూభాగంలో ఈసారి లోటు వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఈ జాబితాలో 48 శాతం లోటు వర్షపాతంతో బిహార్ తొలిస్థానంలో, ఉత్తరప్రదేశ్(46 శాతం), జార్ఖండ్(42 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా సగటు లోటు వర్షపాతం 3 శాతానికి తగ్గిపోయినట్లు తేలింది. వీటిలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా 34% తక్కువ వర్షపాతం నమోదయింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో సాధారణం కంటే 9 %తక్కువ వర్షపాతం రికార్డయింది. వీటితో పోల్చుకుంటే మధ్య భారతంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సగటున 16 శాతం అధిక వర్షపాతం నమోదయింది.
Comments
Please login to add a commentAdd a comment