south states
-
దక్షిణాదిపై యస్ బ్యాంక్ మరింత దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ దక్షిణాదిలో కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోను శాఖలను విస్తరిస్తోంది. ప్రస్తుతం 25గా ఉన్న బ్రాంచీల సంఖ్యను మార్చి ఆఖరు నాటికి 29కి పెంచుకోనున్నట్లు, తదుపరి మరో రెండు కొత్త శాఖలను ప్రారంభించనున్నట్లు బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా తమకు 1,200 పైచిలుకు శాఖలు ఉండగా.. దక్షిణాదిలో 216 ఉన్నాయన్నారు. మైక్రోఫైనాన్స్ విభాగంలోకి ప్రవేశించడంపైనా కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కుదిరితే ఏదైనా సూక్ష్మ రుణాల సంస్థను కొనుగోలు చేస్తామని లేదా సొంతంగానైనా కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. పేటీఎం పరిణామాలపై స్పందిస్తూ దానికి సంబంధించి నాలుగు బ్యాంకులకు వచ్చే వ్యాపారంలో తమకు పాతిక శాతం వాటా రాగలదని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విభాగంపైనా (ఎంఎస్ఎంఈ) దృష్టి పెడుతున్నామన్నారు. ప్రస్తుతం తమ పోర్ట్‌ఫోలియోలో దీని వాటా 30 శాతంగా ఉండగా వచ్చే రెండు, మూడేళ్లలో 35 శాతం వరకు పెంచుకోనున్నట్లు ప్రశాంత్ కుమార్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లలో 18 శాతం, రుణాల్లో 15 శాతం వరకు వృద్ధిని అంచనా వేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ మార్కెట్‌పై స్పందిస్తూ డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 16.6 శాతం వృద్ధి చెంది రూ. 8,887 కోట్లకు చేరాయని, స్థూల రుణాలు 24 శాతం వృద్ధితో రూ. 11,157 కోట్లకు పెరిగాయని ప్రశాంత్ కుమార్ చెప్పారు. కొత్త కాసా (కరెంట్ అకౌంటు, సేవింగ్స్ అకౌంటు) అకౌంట్లు 14 శాతం వృద్ధి చెందాయన్నారు. దక్షిణాదిలో తమ కాసా డిపాజిట్లలో నగరానికి 14 శాతం వాటా ఉందని పేర్కొన్నారు. -
Indian general election 2024: తమిళనాడు నుంచి లోక్‌సభ బరిలో మోదీ...?
దక్షిణాదిన ఈసారి బీజేపీ ప్రధానంగా దృష్టి సారించిన రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ ఆ పార్టీ ఇప్పటిదాకా బోణీ కొట్టలేకపోయింది. అధికార డీఎంకే అక్కడ కాంగ్రెస్‌తో అంటకాగడం బీజేపీకి మింగుడు పడట్లేదు. జయలలిత హయాంలో బీజేపీకి ఏఐఏడీఎంకేతో పొత్తుండేది. అయితే 2014లో అన్నాడీఎంకే 44 శాతం ఓట్లతో 37 సీట్లు నెగ్గితే మిత్రపక్షంగా బీజేపీ కేవలం 5.56 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ఓట్ల శాతం 3.66 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో అక్కడ ఓట్ల శాతాన్ని పెంచుకుని, దాన్ని సీట్లలోకి కూడా మార్చు కోవడం బీజేపీకి కత్తిమీద సామే. మోదీ కరిష్మాతో ఈ పరిస్థితిని అధిగమించాలని పార్టీ భావిస్తోంది. ఇందుకోసం మోదీని తమిళనాడు నుంచి రాష్ట్రం నుంచి బరిలో నిలపాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కోయంబత్తూరు, కన్యాకుమారి, రామనాథపురంలో ఏదైనా ఒక లోక్‌సభ స్థానం నుంచి మోదీ పోటీ చేయవచ్చే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలాన్నిస్తూ మోదీ తమిళనాడులో పదేపదే పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైకి అధిష్టానం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఆయన డీఎంకే ప్రభుత్వ పనితీరు, అవినీతిపై తీవ్రంగా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. అవినీతి ఆరోపణలపై ఇద్దరు డీఎంకే మంత్రులు ఇప్పటికే జైలుకు వెళ్లగా, మరింత మందికి శిక్ష తప్పదనే సంకేతాలను బీజేపీ పంపుతోంది! -
దక్షిణాదిన తలసరి ఆదాయంలో దూసుకుపోతున్న ఏపీ: ఆర్బీఐ గణాంకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదో సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ సందర్భంగా దేశ ఆర్థికాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల కృషి, వాటి వాటాపై సంతోషకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం తోటి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగంలో ముందుకు దూసుకుపోతోంది. 2014 ఫిబ్రవరి-జూన్ మాసాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఫలితంగా అనేక రకాలుగా అననుకూల పరిస్థితులు ఎదుర్కొన్న నవ్యాంధ్ర ప్రదేశ్ ఆర్థిక పనితీరు సంతృప్తికరంగా ఉంది. అంతేకాదు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై స్థాయి మెట్రోపాలిటన్ నగరం రాజధానిగా లేనప్పటికీ ఏపీ గణనీయమైన స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) సాధించిందని ఈ గణాంకాలు వివరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ రూ.13.2 లక్షల కోట్లు. పారిశ్రామికంగా, విద్య, సామాజిక రంగాల్లో మొదటి నుంచీ ముందున్న తమిళనాడు రూ.24.8 లక్షల కోట్ల జీఎస్డీపీ సాధించగా, తర్వాత కర్ణాటక రూ.22.4 లక్షల కోట్లు, తెలంగాణ రూ.13.3 లక్షల కోట్లు, కేరళ రూ.కేరళ రూ. 10 లక్షల కోట్లతో ముందుకు సాగుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం 9 సంవత్సరాల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల జీఎస్డీపీలను కలిపితే రూ.26.5 లక్షల కోట్లు అవుతుంది. అంటే ఒకవేళ రాష్ట్ర విభజన జరిగి ఉండకపోతే– జీఎస్టీడీపీ విషయంలో తమిళనాడు కన్నా ఉమ్మడి ఏపీ ముందుండేది.ఒక ఆంగ్ల వాణిజ్య పక్షపత్రిక 2022కు సంబంధించి ఆర్బీఐ, ఇకనామిక్ సర్వే నుంచి లభించిన గణాంకాల ఆధారంగా కొన్ని అంచనాలు వేసింది. తలసరి ఆదాయంలోనూ ఏపీ పరుగులు తీస్తోంది. దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో ఐటీ, ఔషధాల పరిశ్రమల కేంద్రం హైదరాబాద్ అంతర్భాగంగా ఉన్న తెలంగాణ రూ.2,65,623 తలసరి ఆదాయంతో అగ్రభాగాన నిలవడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కాని, హైదరాబాద్ వంటి పారిశ్రామిక మహానగరం ఆంధ్రప్రదేశ్ లో లేకున్నా ఈ రాష్ట్రం రూ. 2,07,771 తలసరి ఆదాయం నమోదు చేసుకోవడం నిజంగా ఘనవిజయమే. ఎందుకంటే, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర సాంకేతిక, వైద్య విద్యలకు సంబందించి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలా ఆలస్యంగా విద్యాసంస్థలు నెలకొల్పారు. ప్రైవేటు రంగంలో భారీ పరిశ్రమలు, అత్యధిక జీతాలు చెల్లించే రంగాలు కూడా ఏపీలో ఇంకా చెప్పుకోదగ్గస్థాయికి ఎదగలేదు. ఆంధ్ర ప్రాంతం ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఇతర టెక్నాలజీ కోర్సులు చదివిన విద్యార్థులు పీజీ చదువుల కోసం అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లి స్థిరపడడం ఎక్కువ. ఈ నేపథ్యంలో ఏపీ రూ.2,07,771 తలసరి ఆదాయం సాధించడం నిజంగా ప్రశంసనీయం. ఐటీ, ఇతర టెక్నాలజీ రంగాలు, గట్టి పునాదులున్న ఫార్మా రంగాల ద్వారా 21వ శతాబ్దపు నగరంగా రూపుదిద్దుకున్న గ్లోబల్ సిటీ హైదరాబాద్ అంతర్భాగం కావడం వల్ల తెలంగాణ దక్షిణాదిన తలసరి ఆదాయంలో అగ్రభాగాన నిలిచింది. అయితే, తొమ్మిదేళ్ల క్రితం సొంత ప్రయాణం మళ్లీ ప్రారంభించిన ఏపీ తలసరి ఆదాయంలో మంచి ప్రగతి సాధించిందనే చెప్పవచ్చు. కాగా, తలసరి ఆదాయంలో జాతీయ సగటు అయిన రూ.1,50,007ను ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలు దాటì అందనంత ముందుకెళ్లడం ఈ ప్రాంతంలోని ఆర్థిక, సామాజిక, మౌలిక సదుపాయాల పునాదులకు అద్దంపడుతోంది. దక్షిణాదిన ఈ ఐదు రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ మధ్య ఆర్థికాభివృద్ధికి సంబంధించి గట్టి పోటీ ఉందని కూడా ఆర్బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, మిగిలిన మూడు రాష్ట్రాలూ ఈ రెండింటితో పోటీపడుతూ ముందుకు పరిగెడుతున్నాయి. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ సహా ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలూ భారత ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజన్లుగా ఉపయోగపడుతున్నాయి. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్ సీపీ -
ఉత్తరాది గ్యాంగ్స్టర్లు దక్షిణాది జైళ్లకు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాంగ్స్టర్ల ఆగడాలను చెక్‌పెట్టేందుకు, వారి విస్తృత నెట్‌వర్క్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ఎన్ఐఏ కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్లను దక్షిణాది రాష్ట్రాల జైళ్లకు తరలించాలని భావిస్తోంది. నాలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాల సరఫరా, సుపారీ హత్యలు, హవాలా దందా, బెదిరింపు వసూళ్లు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాల్లో కొందరు గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేసి సెంట్రల్ జైళ్లలో పడేశారు. వాళ్లు అక్కడి నుంచే నిక్షేపంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. తొలి దశలో వారిలో 25 మందిని దక్షిణాది జైళ్లకు బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. మూసావాలా హత్యతో అలర్ట్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దక్షిణాసియాలోని అతిపెద్ద, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే జైళ్లలో ఒకటైన ఢిల్లీలోని తీహార్ జైలు నుంచే మూసేవాలా హత్య ప్రణాళికను గ్యాంగ్స్టర్లు అమలు చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తిహార్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన నెట్వర్క్ ద్వారా ఈ హత్య చేయించారనే కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. తిహార్‌లోనే ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ నీరాజ్ బవానా సైతం జైలు నుంచే తన వ్యాపారాన్ని ఇష్టారీతిగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో ఉన్న గ్యాంగ్స్టర్లదీ ఇదే పంథా. జైళ్లలో కొత్తగా చిన్న ముఠాలుగా ఏర్పడి తమ ప్రణాళికను అమలుచేస్తున్నారు. ఏప్రిల్‌లో గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగిను చంపేశాడనే కోపంతో మరో గ్యాంగ్‌స్టర్ శేఖర్ రాణాను గోగి సన్నిహితుడు రోహిత్ మోయి జైలు నుంచే కుట్ర పన్ని హత్య చేయించాడు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఉత్తరాదిన పెరిగాయి. కొన్ని కేసుల్లో గ్యాంగ్స్టర్లకు జైలు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం మధ్య ఆధిపత్య పోరు పెరిగి గొడవలకు దారితీస్తోంది. వీరికి విదేశాల నుంచి ఆర్ధిక సహకారం అందుతోందనే దారుణ వాస్తవాలు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యాయి. ఉత్తరాది జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం కూడా ఎన్ఐఏ ప్రతిపాదనకు మరో కారణం. ఢిల్లీలో 14 సెంట్రల్ జైళ్ల సామర్ధ్యం 9,346 కాగా 17,733 మంది ఖైదీలున్నారు. పంజాబ్‌లో జైళ్లలో 103 శాతం, హరియాణాలో 127 శాతం, రాజస్థాన్‌లో 107 శాతం ఖైదీలున్నారు. -
అందుకే దక్షిణాది రాష్ట్రాల నుంచి తక్కువ అప్పీళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం అందించిన హక్కులు ప్రజలందరికీ సమానంగా అందాలంటే దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు–పాండిచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల బార్ కౌన్సిల్ చైర్మన్లు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు బి.కొండారెడ్డి అధ్యక్షతన ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఇందులో ఐదు రాష్ట్రాల బార్ కౌన్సిల్ చైర్మన్లు ఎ.నరసింహారెడ్డి, గంటా రామారావు, పీఎస్ అమల్‌రాజ్, కేపీ జయచంద్రన్, ఎల్.శ్రీనివాసబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా... దక్షిణాది రాష్ట్రాలకు ఢిల్లీ వేల కిలోమీటర్ల దూరంలో ఉండటం.. సుప్రీంకోర్టు న్యాయవాదులు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండటంతో దక్షిణాది రాష్ట్రాల హైకోర్టుల నుంచి దాదాపు 3 శాతం మాత్రమే సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలవుతున్నాయని వారు తెలిపారు. ఢిల్లీకి వెళ్లే సమయం, డబ్బు వెచ్చించలేక అప్పీళ్లు దాఖలు చేయడంలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు ఢిల్లీ హైకోర్టు నుంచి 9.5 శాతం, ఉత్తరాది రాష్ట్రాల నుంచి దాదాపు 5 నుంచి 6 శాతం అప్పీళ్లు దాఖలవుతున్నాయని తెలిపారు. (చదవండి: నేడు సుప్రీంకోర్టులో ‘పంచాయతీ’) దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కోరారు. లా కమిషన్ చైర్మన్లు జస్టిస్ కె.కె.మాథ్యూ, జస్టిస్ దేశాయ్, జస్టిస్ లక్ష్మణన్‌లు దక్షిణాది రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారని గుర్తుచేశారు. సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలంటూ అన్ని బార్ కౌన్సిళ్లు తీర్మానం చేయాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు బెంచ్ సాధన సమితి కన్వీనర్‌గా ఎ.నరసింహారెడ్డిని ఎన్నుకున్నారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. -
ఎజెండా రెడీ!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ నెల 11న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి కృష్ణాబోర్డు, తెలంగాణ సమాయత్తమవుతున్నాయి. సమా వేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలు, చేయాల్సిన అభ్యర్థనలపై కృష్ణా బోర్డు, తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగిరం చేశాయి. ఇప్పటికే కృష్ణా బోర్డు నాలుగైదు ప్రధానాంశాలతో ఎజెండా సిద్ధం చేయగా, తెలంగాణ సాగునీటి పారుదలశాఖ అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై శుక్రవారం ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. ప్రధానంగా గోదావరి మళ్లింపు జలాల అంశం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో కేంద్రం ఈ నెల 11న కీలక సమావేశం ఏర్పాటు చేయనుండగా, ఇందులో నాలుగు ప్రధాన అంశాలను కేంద్రం ముందుంచాలని బోర్డు నిర్ణయించింది. ప్రధానంగా ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న గోదావరి మళ్లింపు జలాల అంశాన్ని చర్చించనుంది. పట్టిసీమ, పోలవరంల ద్వారా గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు తరలిస్తే, అందులో వాటాగా తెలంగాణ 80 టీఎంసీల మేర కృష్ణా జలాలు వాడుకునే అంశంపై స్పష్టత కోరనుంది. దీంతో పాటే చెన్నై తాగునీటి అవసరాలకు నీటి సరఫరా అంశాన్ని ఈ భేటీలో ప్రస్తావించనుంది. సమయానుకూలంగా ఇరు రాష్ట్రాల తమ వాటా మేరకు నీటిని విడుదల చేసేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు నిర్ణయించింది. వీటితో పాటే ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణ అంశం ప్రతిసారీ బోర్డు సమావేశాల్లో చర్చకు వస్తున్నా, దీనికి ఓ పరిష్కారం మాత్రం దొరకడం లేదు. గతంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల భేటీలోనూ ఈ అంశం చర్చకు వచ్చినా పనులు మాత్రం పూర్తవలేదు. ఈ దృష్ట్యా దీనికి పరిష్కారం వెతకనున్నారు. ఇటు టెలిమెట్రీ ఏర్పాటును బోర్డు తెరపైకి తెస్తోంది. నిధులపైనే ఫోకస్.. ఇక తెలంగాణ మాత్రం ఈ భేటీ ద్వారా బహుళార్ధక సాధక ప్రాజెక్టులకు నిధులు సాధించుకోవాలన్న భావనలో ఉంది. ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు.. అయితే జాతీయ హోదా, లేని పక్షంలో ఇప్పటికే కేంద్రం ముందుంచిన మాదిరి నీటి సత్వర ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద ఆర్థిక సాయం కోరేందుకు సిద్ధమైంది. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో ఇప్పటికే రూ.55 వేల కోట్ల పనులు పూర్తి చేసినందున, మిగిలిన పనుల పూర్తికి కేంద్ర సాయాన్ని కోరనుంది. ఇటు ఇప్పటికే మిషన్ కాకతీయ ద్వారా 30 వేల చెరువులకు పైగా పునరుద్ధరించినందున వాటికి చేసిన ఖర్చును రీయింబర్స్ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేయనుంది. దీంతో పాటే కృష్ణా జల వివాదాలకు సత్వర పరిష్కారం, ట్రిబ్యునల్‌లో కొత్త సభ్యుడి నియామకంపైనా తెలంగాణ ప్రస్తావించేందుకు నిర్ణయం తీసుకుంది. -
నాలుగోవంతు లోటు వర్షపాతమే!
న్యూఢిల్లీ: భారత్‌లోని 25 శాతం భూభాగంలో ఈసారి లోటు వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఈ జాబితాలో 48 శాతం లోటు వర్షపాతంతో బిహార్ తొలిస్థానంలో, ఉత్తరప్రదేశ్(46 శాతం), జార్ఖండ్(42 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా సగటు లోటు వర్షపాతం 3 శాతానికి తగ్గిపోయినట్లు తేలింది. వీటిలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా 34% తక్కువ వర్షపాతం నమోదయింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో సాధారణం కంటే 9 %తక్కువ వర్షపాతం రికార్డయింది. వీటితో పోల్చుకుంటే మధ్య భారతంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సగటున 16 శాతం అధిక వర్షపాతం నమోదయింది. -
దక్షిణాదిలో వర్కవుట్ కాని బీజేపీ ప్లాన్
-
సౌత్ వర్సెస్ నార్త్: ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై సవతి ప్రేమ చూపిస్తోందని, దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి అధికమొత్తంలో పన్నుల సొమ్ము చేరుతున్నా... మోదీ సర్కారు మాత్రం తమ రాష్ట్రాలకు తగినంత వాటా తిరిగి ఇవ్వడం లేదని దక్షిణాది ముఖ్యమంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది నుంచి వెల్లువెత్తుతున్న అసంతృప్తుల నేపథ్యంలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సహకార సమాఖ్యవాదానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన గురువారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఏ ఒక్క ప్రాంతం పట్ల వివక్ష చూపించడం లేదంటూ వారి అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేశారు. చెన్నై పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి భారీ నిరసనలు స్వాగతం పలికాయి. కావేరి జలాల వివాదం నేపథ్యంలో మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వమించారు. ఓ భారీ నల్లరంగు బెలూన్ను గాలిలోకి వదిలారు. అటు సోషల్ మీడియాలోనూ గోబ్యాక్‌మోదీ హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. జనాభా నియంత్రణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు తమ రాష్ట్రాలను దెబ్బతీసేలా ఉన్నాయని దక్షిణాది నేతలు వ్యక్తం చేస్తున్న ఆందోళనను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. ‘15వ ఆర్థిక సంఘం సిఫారసులు కొన్ని రాష్ట్రాలు, ఓ ప్రాంతం పట్ల వివక్ష చూపేలా ఉన్నాయంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. జనాభా నియంత్రణ కోసం కృషి చేస్తున్న రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కేంద్రం ఆర్థిక సంఘానికి సూచించింది. ఈ విషయంలో ఎంతో కృషి చేస్తూ.. వనరులు వినియోగిస్తున్న తమిళనాడు రాష్ట్రం లబ్ధి పొందనుంది’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘సహకార సమాఖ్యవాదానికి కేంద్రం కట్టుబడి ఉంది. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ మా మంత్రం. అందరూ కలిసి పనిచేసి.. మన స్వాతంత్ర్య పోరాటయోధులు గర్వపడే నవభారతాన్ని నిర్మిద్దాం’ అని మోదీ అన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర వాటాను రాష్ట్రాలకు ఇవ్వాలంటూ 15వ ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం సూచించడంపై దక్షిణాది రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణలో విఫలమైన ఉత్తరాది రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ వంటివాటికి ప్రత్యేక రాయితీలు ఇస్తూనే.. కేవలం దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కోత పెట్టేందుకు జనాభా నియంత్రణ ప్రాతిపదికను తీసుకొస్తున్నారంటూ దక్షిణాది రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. -
ఉత్తరాదిని పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశంలో నానాటికి పెరుగుతున్న జనాభానే పెద్ద సమస్యనే విషయం పాఠశాలకు వెళ్లే ప్రతి పిల్లవాడితో సహా ప్రతి పౌరుడికి తెల్సిందే. అందుకనే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1952లో కుటుంబ నియంత్రణను అమల్లోకి తెచ్చిన దేశంగా భారత్‌కు గుర్తింపు వచ్చింది. మరో ఆరేళ్లలో మరో గుర్తింపు రానుంది. ప్రస్తుతం 130 కోట్ల జనాభా కలిగిన భారత దేశం 2024 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాను అధిగమిస్తుందన్నదే ఆ రికార్డు. 1950లో చైనా జనాభా మనకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేదంటే ఇప్పుడు ఎంత వేగంగా జనాభాలో ముందుకు దూసుకుపోతున్నామో గ్రహించవచ్చు. జనాభా పెరుగుదలకు సామాజిక ఆర్థిక పరిస్థితులకు విడదీయలేని అనుబంధం ఉంటుందనే విషయం తెల్సిందే. అంటే జనాభా ఎక్కువ ఉంటే సామాజిక ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని, తక్కువ ఉంటే తక్కువ ఉంటాయని అర్థం. ఎక్కడైనా ఇది నిజమేగానీ మన రాష్ట్రాల విషయంలో మాత్రం ఇది పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి ఎక్కువ. మరణాలు తక్కువ. దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి తక్కువ మరణాలు ఎక్కువ. అంటే ఉత్తరాదిలో జనాభా ఎక్కువగా పెరుగుతోంది. దక్షిణాదిలో పెరుగుదల చాలా తక్కువగా ఉంటోంది. మన దేశంలో రాష్ట్రాల నుంచి పన్ను వసూళ్లు ఆర్థిక ప్రగతిపై ఆధారపడి ఎక్కువ, తక్కువగా ఉంటే, ఆర్థిక వనరుల పంపకాలు మాత్రం జనాభా ప్రాతిపదికన జరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడి ఉత్తరాది రాష్ట్రాలు బతుకుతున్నాయి. కేంద్రం చెప్పిన లెక్కలే ఇవి కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జనాభా గణాంకాల ప్రకారం బిహార్‌లో సంతానోత్పత్తి రేటు 3.41 శాతం ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో 2.74 శాతం ఉంది. అంటే భారత్‌లోని మొత్తం జనాభాలో మూడోవంతు జనాభా ఈ రెండు రాష్ట్రాలకు చెందినదే. 1951 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడులో జనాభా బిహార్‌కన్నా ఎక్కువగా ఉండగా, నేడు తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్ల జనాభా బిహార్‌లో ఎక్కువగా ఉంది. అదే 1951లో కేరళకన్నా మధ్యప్రదేశ్ జనాభా 37శాతం ఎక్కువగా ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్ జనాభా కేరళకన్నా 217 శాతం ఎక్కువ. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు 1.5 శాతానికి మించలేదు. దేశం మొత్తం మీద 1.17 శాతంతో సిక్కింలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకే రూపాయికిపైగా కేటాయింపులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి చెల్లిస్తే కేంద్రం నుంచి 52 పైసలు వెనక్కి వచ్చేది. అలాగే తమిళనాడుకు 56 పైసలు, కేరళకు 49 పైసలు వచ్చేది. ఇక బిహార్ రూపాయి చెల్లిస్తే 1.17 రూపాయలు, ఉత్తరప్రదేశ్‌కు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా రూపాయికిపైగానే ముట్టేది. అంటే దక్షిణాది రాష్ట్రాలిచ్చే నిధులతో ఉత్తరాది రాష్ట్రాలు కడుపునింపుకుంటున్నాయి. తాజా లెక్కలు అందుబాటులో లేవు. ఇదే కారణంగా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా జీఎస్టీ బిల్లు ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించారు. ఎంపీ సీట్ల విషయంలోనూ అన్యాయం ఇక జనాభా ప్రాతిపదికనే పార్లమెంట్ సీట్ల సంఖ్య ఆధారపడి ఉండడంతో ఉత్తరాది రాష్ట్రాలే ఎక్కువగా లాభపడుతున్నాయి. అమెరికాలో రాష్ట్రం ప్రాతిపదిక సీట్ల కేటాయింపు ఉండగా, భారత్‌లో 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన 1976లో పార్లమెంట్ సీట్ల కేటాయింపు చట్టాన్ని తీసుకొచ్చారు. దీన్ని 2000 సంవత్సరం వరకు అమలు చేయాలని ముందుగా నిర్ణయించారు. ఆ తర్వాత అమలు పీరియడ్‌ను 2026 వరకు పొడిగించారు. ఈ కారణంగానే 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, నాలుగు రాష్ట్రాల నుంచే 51 శాతం సీట్లను గెలుచుకుంది. అధిక జనాభా కారణంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఉద్యోగార్థుల వలసలు పెరుగుతున్నాయి. అదీ కూడా మనకు నష్టమే. మొత్తంగా అధిక జనాభా కలిగిన ఉత్తరాది హిందీ రాష్ట్రాలు లాభపడుతుంటే, జనాభా తగ్గి దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి. -
దేశవ్యాప్తంగా కమల వికాసానికి కసరత్తు
-
లారీల సమ్మె విజయవంతం
యజమానుల అరెస్టు, విడుదల కర్నూలు: దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సమ్మె పిలుపులో భాగంగా కర్నూలులో లారీల సమ్మె తొలి రోజు గురువారం విజయవంతమైంది. హైదరాబాద్ జాతీయ రహదారిలోని సంతోష్‌నగర్ దగ్గర లారీలను అడ్డుకున్న లారీ యజమానుల సంఘం అధ్యక్షులు గోపి, ఉపాధ్యక్షుడు మిన్నెల్లతో పాటు మరో పది మంది నాయకులను నాలుగో పట్టణ పోలీసులు సీఐ నాగరాజురావు ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. విషయం తెలిసిన వెంటనే లారీ యజమానులు, కార్మికులు పెద్ద ఎత్తున నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, నగర కార్యదర్శి పుల్లారెడ్డి తదితరులు ధర్నాలో పాల్గొని లారీ యజమానుల అరెస్టును ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగంపై భారాలు మోపడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కోట్లాది ప్రజలకు నిత్యావసరాలను సరఫరా చేసే రవాణా రంగంపై ఆర్టీఏ ఫీజులు, జరిమానాలు పెంచడంతో పాటు వాహనాలపై థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ 50 శాతం పెంచడం దారుణమన్నారు. పెరిగిన డీజిల్ ధరలు, టోల్‌గేట్స్ తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో రవాణా రంగం సంక్షోభంలో పడిందన్నారు. లారీ యజమానుల సంఘం నాయకులు యూసుఫ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నాగరాజు, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు రియాజ్, గంగాధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల అధికారులతో నీతి ఆయోగ్ సమావేశం హైదరాబాద్ లో బుధవారం ప్రారంభమైంది. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై రాష్ట్రాల అధికారులతో ఆయన చర్చించనున్నారు. ఈ సమావేశానికి పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్ష్యదీప్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.