North West
-
Rahul Gandhi: మహిళలంటే చిన్నచూపు!
న్యూఢిల్లీ: మహిళలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగానే చూస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నార్త్ వెస్ట్ ఢిల్లీ పార్టీ అభ్యర్థి ఉదిత్ రాజ్ తరఫున గురువారం ఢిల్లీలోని మంగోల్‌పురిలో మహిళలు మాత్రమే పాల్గొన్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ఎంతో ఆర్భాటంగా ఇప్పుడే మహిళాలోకం కలలు సాకారం చేస్తున్నట్లు పార్లమెంట్లో నారీశక్తి వందన్ అధినయమ్(మహిళా రిజర్వేషన్ బిల్లు) ప్రవేశపెట్టారు. ఆ చట్టం ఇప్పుడు కాదు ఏకంగా పదేళ్ల తర్వాత అమలుచేస్తామని తీరిగ్గా చెప్పారు. ఈ నిర్ణయం వెనుక ఒక సిద్దాంతముంది. అదే ఆర్ఎస్ఎస్. బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ అయితే ఏకంగా మహిళలను కనీసం ‘శాఖ’లోకి అడుగుపెట్టనివ్వడంలేదు. మహిళలను రెండో తరగతి పౌరులుగా భావించాలని ఆర్ఎస్ఎస్ నరనరాల్లో నాటుకుపోయింది’ అని విమర్శలు గుప్పించారు. వర్కింగ్ ఉమెన్ పనికి గుర్తింపు దక్కట్లేదు ‘‘భారత్‌లో ప్రతీ రంగం గురించి మాట్లాడతాంగానీ వర్కింగ్ ఉమెన్ ఇంట్లోనూ చేసే శ్రమకు ఎక్కడా గుర్తింపు దక్కట్లేదు. రోజంగా ఆఫీస్/కార్యస్థలంలో పనిచేసి అలసిపోయిన మహిళలు ఇంటికొచ్చాక మళ్లీ రెండో షిప్ట్ మొదలెడతారు. పిల్లల ఆలనాపాలనా చూసుకుని ఇంటి పనులన్నీ చేస్తారు. ఈ పనికి వాళ్లకు ఎలాంటి చెల్లింపులు ఉండవు. పురుషులు రోజుకు 8 గంటలు పనిచేస్తే మహిళలు 16 గంటలపైనే పనిచేస్తారు. వారి శ్రమకు ప్రతిఫలంగా ఏమీ దక్కట్లేదు. ఇది ఒక రకంగా చెల్లింపులులేని గుర్తింపులేని పని. మేం అధికారంలోకి వస్తే మహాలక్ష్మీ యోజన ద్వారా పేద మహిళలకు నెలకు రూ.8,500 చొప్పున ఏటా రూ.1 లక్ష వారి ఖాతాలో జమచేస్తాం’’ అని రాహుల్ అన్నారు. మే 25నాటి పోలింగ్‌కు ప్రచారం గురువారంతో ముగుస్తుండటంతో ఢిల్లీ మెట్రోలోనూ రాహుల్ ప్రయాణించారు. ‘‘నార్త్ ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ తరఫున సైతం రాహుల్ దిల్షాద్ గార్డెన్ ప్రాంతంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీ భవన్లో మధ్యాహ్న భోజనం ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన రాహుల్ మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్/తెలంగాణ భవన్‌కు వచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌సహా దాదాపు 10 మందితో కలిసి రాహుల్ భోజనం చేశారు. రాహుల్ పూరీలు, చపాతీలు, కోడికూర వేపుడు, రొయ్యల వేపుడు ఆర్డర్ ఇచ్చారు. తొలుత పూరీ/చపాతీని పప్పుతో కలిపి తిన్నారు. తర్వాత చికెన్ ఫ్రై, రొయ్యల ఫ్రైతో చపాతీ/పూరీ తిన్నారు.మీ కీలక పాత్ర పోషించండి...సోనియా గాంధీ ఢిల్లీ పరిధిలో ప్రచారం చివరిరోజు సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం ఓటర్లకు ఒక వీడియో సందేశం విడుదలచేశారు. ‘‘ ప్రజాస్వామ్య పరిరక్షణకు జరుగుతున్న కీలక ఎన్నికలివి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రాజ్యాంగబద్ధ సంస్థలపై దాడులు కొనసాగుతున్న వేళ వచి్చన ఎన్నికలివి. ఈ పోరాటంలో మీరు మీ కీలక పాత్ర పోషించండి. మీ ఓటు ఉపాధి కల్పనకు బాటలువేస్తుంది. ఎగసిన ధరలను కిందకు దింపుతుంది. మహిళలకు సాధికారతను కట్టబెడుతుంది. మెరుగైన భవిష్యత్తుతో సమానత్వాన్ని సాధిస్తుంది. ఢిల్లీ పరిధిలోని ఏడు ఎంపీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి అభ్యర్థులను గెలిపించండి’ అని సోనియా సందేశమిచ్చారు. -
India Meteorological Department: 25 నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం!
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈ నెల 25వ తేదీ తర్వాత వాయవ్య భారత్ నుంచి వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. అక్టోబర్ 15 నాటికి నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయి. రాబోయే ఐదు రోజుల్లో ఉత్తర, మధ్య భారతదేశంలో వర్షాలు తగ్గిపోతాయని తెలియజేసింది. పశి్చమ రాజస్తాన్ నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనానికి అనువుగా పరిస్థితులు మారుతున్నాయని పేర్కొంది. ఈ రుతుపవనాలతో సాధారణంగా 832.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ, ఈసారి 780.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. -
దేశవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండలు
న్యూఢిల్లీ: ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం సాధారణం కంటే ఎక్కువగా 40 డిగ్రీల సెల్సియస్ చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు, వాయవ్య భారతదేశంలో వచ్చే నాలుగు రోజుల్లో వడగాలులు వీసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, సిక్కిం, జార్ఖండ్ రాష్ట్రాలతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ల్లో ఈ పరిస్థితులుంటాయని వివరించింది. దక్షిణ భారతంలోని ఏపీ తీరప్రాంతంలో బుధవారం వరకు భానుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం వరుసగా రెండో రోజు సాధారణం కంటే కనీసం 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించింది. బుధవారం నాటికి వాతావరణం కొద్దిగా చల్లబడే అవకాశాలున్నాయంది. -
అభివృద్ధి కేంద్రంగా అరుణాచల్!
యుపియా: వాయవ్య ఆసియాకు అరుణాచల్‌ను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర 36వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ భద్రతా కోణంలో చూస్తే అరుణాచల్‌లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పన సాకారమైందని మోదీ అన్నారు. ‘21వ శతాబ్దంలో తూర్పు భారతం ముఖ్యంగా ఈశాన్యప్రాంతం దేశాభివృద్ధికి ఇంజన్‌లా పనిచేస్తోంది’ అని మోదీ అన్నారు. యువ ముఖ్యమంత్రి పెమా ఖండూ సారథ్యంలో ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహంతో డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరింతగా కష్టపడి పనిచేయనుంది అనిమోదీ అన్నారు. ‘అరుణాచల్ అద్భుత ప్రగతి దిశగా అడుగులేస్తోంది. మీకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. -
వణుకుతున్న వాయవ్య భారతం
జైపూర్: శీతగాలులు వాయవ్య భారతాన్ని వణికిస్తున్నాయి. రాజస్తాన్, పంజాబ్‌లలో గడ్డకట్టించే చలితో జనం గజగజ వణికిపోతున్నారు. వరుసగా రెండోరోజు కూడా రాజస్తాన్‌లోని ఫతేపూర్, చురుల్లో రికార్డు స్థాయిలో కనీస ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఫతేపూర్‌లో మైనస్ 4.7 డిగ్రీల సెల్సియస్, చురులో మైనస్ 2.6 డిగ్రీలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం వెల్లడించింది. గడిచిన 12 ఏళ్లలో చురులో ఇదే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఆదివారం సికార్, కరౌలి, చిత్తోర్‌గఢ్ జిల్లాలోనూ రికార్డు స్థాయిలో కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సికార్‌లో మైనస్ 2.6 డిగ్రీలు, కరౌలీలో మైనస్ 0.6, చిత్తోర్‌గఢ్‌లో మైనస్ 0.2 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భిల్వారాలో జీరో డిగ్రీలు, పిలానీలో 0.1, నాగౌర్‌లో 0.2, అల్వార్‌లో 0.4, బనస్థలిలో 1.5, సంగారియాలో 1.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమృత్‌సర్‌లో మైనస్ 0.5 డిగ్రీలు హరియాణా, హిమాచల్‌ప్రదేశ్ కూడా చలి గుప్పిట్లో గజగజ వణికిపోతున్నాయి. అమృత్‌సర్‌లో మైనస్ 0.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హల్వారాలో జీరో డిగ్రీలు, భటిండా 0.1, ఫరీద్‌కోట్‌లో 1, పటాన్‌కోట్‌లో 1.5 డిగ్రీలకు శనివారం రాత్రి కనిష్ట ఉప్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, కశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం తీవ్ర చలిగాలు వీచాయి. ఢిల్లీలో 4.6 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదైంది. అమర్నాథ్ యాత్రకు బేస్‌క్యాంప్ అయిన కశ్మీర్‌లోని గుల్మార్గ్ రిసార్ట్‌లో మైనస్ 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బారాముల్లాలో మైనస్ 6.5 డిగ్రీలు, శ్రీనగర్‌లో మైనస్ 6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తాగునీటిని సరఫరా చేసే పైపుల్లో మంచు గడ్డకట్టుకుపోయింది. పలు సరస్సులు గడ్డకట్టాయి. కాకపోతే కశ్మీర్ ప్రజలకు ఇది అలవాటే కాబట్టి తట్టుకోగలుగుతున్నారు. -
నా కూతురు అధ్యక్షురాలైతే బాగుండేది: కిమ్
సాక్షి, లాస్ ఏంజిల్స్: తన నాలుగేళ్ల కూతురు అమెరికా అధ్యక్షురాలైతే బాగుండేదని ప్రముఖ టీవీ నటి కిమ్ కర్దాషియన్ అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే తన కూతురు నార్త్ వెస్ట్ అద్భుతంగా పరిపాలిస్తుందని జోక్ చేశారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె ఈ వాఖ్యలు చేశారు. ఇప్పుడున్న అధ్యక్షుడి కంటే వేరే వాళ్లు ఎవరైనా అమెరికాను చక్కగా పరిపాలిస్తారని కిమ్ అన్నారు. తన కూతురైతే ఇంకా బాగా పాలిస్తుందని చెప్పారు. అమెరికా ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలవడానికి దేశ పౌరులు కష్ట పడ్డారని తెలిపారు. అమెరికా గురించి గొప్పగా చెప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. అయితే, ట్రంప్ మాత్రం అమెరికాను వెనక్కు తీసుకెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రోజు ఏం జరుగుతుందనే ఆందోళన ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి ప్రజల్లో నెలకొందని చెప్పారు.