బెజవాడలో వేడి తగ్గిందట!
బ్లేజ్‌వాడగా పేరొందిన విజయవాడలో ఏటా ఎండలు మెండుగానే ఉంటాయి. కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే వస్తున్న విషయం జిల్లావాసులకు ఎరుకే. ఈ ఏడాది మార్చిలోనే భానుడు చండ్రప్రచండుడయ్యాడు. వడదెబ్బ బారిన పడి ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. సీన్ కట్ చేస్తే.. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఎండల గురించి కూల్‌గా మాట్లాడారు.
తాను విజయవాడ వచ్చిన తర్వాత చెట్లు బాగా పెంచి వాతావరణాన్ని చల్లబరిచానని చెప్పారు. అందుకే నగరంలో ఉష్ణోగ్రతలు గతంకన్నా తగ్గిపోయాయని పేర్కొన్నారు. -సాక్షి ప్రతినిధి, విజయవాడ