
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో 10 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు తగ్గించాలన్నారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
వేసవిలో వడగాడ్పులు పెరిగే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువులు, కాలువలు, జలాశయాల్లో నీటి నిల్వలు పెంచాలని, పచ్చ దనం, తుంపర సేద్యం ద్వారా ఉష్ణోగ్రతలను కొంత మేరకు తగ్గించగలమని చెప్పారు.