Bigg Boss 5 Telugu Latest Promo: Sunny Imitated Sriram - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: చర్రితలోనే ఫస్ట్‌ టైమ్‌ ఇలాంటి బ్రేకప్‌!

Oct 12 2021 5:04 PM | Updated on Oct 12 2021 5:35 PM

Bigg Boss 5 Telugu Latest Promo: Sunny Imitated Sriram - Sakshi

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఐదు వారాలను దిగ్విజయంగా ముగించుకొని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. నిన్న జరిగిన ఎలిమినేషన్‌ ప్రక్రియలో ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు. దీంతో హౌస్‌ అంతా గంభీరంగా మారిపోయింది. ప్రతి సోమవారం బిగ్‌బాస్‌ ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉండడం కామన్‌. అయితే ఈ వారం గొడవల మోతాదు కాస్త ఎక్కువైంది. దీంతో బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులను కూల్‌ చేసే పనిలో పడినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది.

నామినేషన్‌ ప్రక్రియ ముగియగానే ఇంటి సభ్యులంతా మళ్లీ ఒక్కటైనట్లు తెలుస్తోంది. సన్నీ అయితే ఎప్పటి మాదిరే తనదైన పంచులతో ఇంటి సభ్యులను నవ్వించాడు. శ్రీరామ్‌ను ఇమిటేట్‌ చేస్తూ పలకించిన హావభావాలు హౌస్‌లో నవ్వులు పూయించాయి. అలాగే హమిదా ఎలా అరుస్తుందో చేసి చూపించేసరికి అందరూ పెద్ద ఎత్తున నవ్వుకున్నారు. మరోవైపు కాజల్‌, శ్రీరామ్‌లు మధ్య నామినేషన్‌ ప్రక్రియ చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. నిన్నటి నామినేషన్‌కి బాగా హర్ట్‌ అయిన కాజల్‌.. శ్రీఆమ్‌ని ఉద్దేశిస్తూ.. ‘బ్రేకప్‌ బ్రో.. చరిత్రలో బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ బ్రేకప్‌ ఫస్ట్‌ టైమ్‌ కదా’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక త్రిమూర్తులు (షణ్ముఖ్‌, జెస్సీ, సిరి) ఎప్పటి మాదిరే ఇతర సభ్యులపై పంచులేశారు. ‘ఐన్‌స్టీన్‌ E=mc2 ఎందుకు కనిపెట్టాడో కూడా కనుక్కోవచ్చు. కానీ ఎలిమినేషన్స్‌ అర్థంకావు’అని షణ్నూ చేసిన ఫన్నీ కామెంట్‌కి  జెస్సీ, సిరి పగలబడి నవ్వారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement