బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ అలా ముగిసిందో లేదో.. ఇంతలోనే ‘కెప్టెన్సీ టాస్క్’ అంటూ ఇంటి సభ్యుల మధ్య మరో చిచ్చు పెట్టాడు బిగ్‌బాస్. ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ చాలా ఆసక్తి కనబర్చుతున్నారు. దీని కోసం ‘నియంత మాటే శాసనం’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో ఒక నియంత సింహాసనం ఉంటుంది. అందులో ఎవరైతే ముందుగా కూర్చుంటారో వాళ్లు ఆ రౌండ్ ముగిసేవరకు నియంతలా వ్యవహరిస్తారు. అంతేకాదు ఆ రౌండ్ వరకు వాళ్లు సేఫ్ అవుతారు కూడా. మిగిలిన ఇంటి సభ్యులు తమని తాము సేవ్ చేసుకోవడానికి ఓ చాలెంజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్‌లో చివరి స్థానంలో నిలిచిన ఇద్దరి ఇంటి సభ్యుల్లో ఒకరిని సేవ్ చేసే అవకాశం నియంత కుర్చిలో కూర్చున్న వ్యక్తికి ఉంటుంది. ఈ టాస్క్‌లో ముందుగా సిరి నియంత సింహాసనం ఎక్కి..‘ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. అమ్మాయిలు వాట్ టు డు.. వాట్ నాట్ టు డు’అంటూ హౌస్‌మేట్స్‌ని నవ్వించింది.
ఇక నామినేషన్స్ ప్రక్రియలో మొదలైన గొడవను కెప్టెన్సీ టాస్క్‌లోనూ కంటిన్యూ చేశారు కాజల్, శ్రీరామ్. చాలెంజ్‌లో ఓడిన కాజల్, రవిలలో ఒకరిని సేవ్ చేసే చాన్స్ శ్రీరామ్‌కు వచ్చింది. ‘నేను కెప్టెన్ కావాలనుకుంటున్నా’అని కాజల్ అడగ్గా, ‘నువ్వు రెండు ఫొటోలు కాల్చేశావు కదా! నువ్వు కెప్టెన్ అయితే ఏం చేసేదానివి’ అని శ్రీరామ్ ప్రశ్నించారు. కెప్టెన్ అయితే ఫెరింజన్‌లో కూర్చును’అని సమాధానం చెప్పింది కాజల్. ఆమె సమాధానానికి సంతృప్తి చెందని శ్రీరామ్..అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే కెప్టెన్ బ్యాండ్ వేసుకోవాలి అంటూ రవిని సేవ్ చేశాడు. మరి ఈ టాస్క్‌లో గెలిచి కెప్టెన్ అయిందెవరో తెలియాలంటే.. ఆ వారం ఎపిసోడ్ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment