రేపట్నుంచే ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: ఎండల నేపథ్యంలో బుధవారం (15వ తేదీ) నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. డీఈవోలకు పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త విద్యా సంవత్సరాన్ని ఈ నెల 21 నుంచే మొదలు పెట్టాలని పేర్కొన్నారు. ‘‘మండల పాయిం ట్‌కు చేరుకున్న పాఠ్యపుస్తకాల్లో తమ స్కూళ్లకు అవసరమైన వాటిని ప్రధానోపాధ్యాయులు 16– 20 తేదీ ల్లోపు తీసుకెళ్లాలి.
ఆలోగా వార్షిక పరీక్షల ఫలితాలను వెల్లడించి, చదువులో వెనుకబడిన విద్యార్థులకు 21నుంచి ప్రత్యా మ్నాయ బోధన కార్యక్రమం చేపట్టాలి. ఏప్రిల్ 3–13 మధ్య బడిబాటకు ఏర్పాట్లు చేయాలి’’ అని ఆదేశించారు.