మెడిక్షనరీ
శరీరానికి కాస్తంత ఎండ పొడ సోకాలి. లేలేత సూర్యకిరణాలు సోకితేనే శరీరంలో విటమిన్-డి తయారవుతుంది. అయితే, అత్యంత అరుదుగా కొందరికి సూర్యరశ్మి ఏమాత్రం సరిపడదు. వాళ్ల చర్మానికి కొద్దిసేపు ఎండ సోకినా, ఎండ తాకిన ప్రదేశమంతా మచ్చలు, దద్దుర్లు ఏర్పడతాయి. ఒక్కోసారి అగ్నిప్రమాదానికి గురైన స్థాయిలోనే చర్మమంతా కమిలిపోయి చూడటానికే భయంకరంగా మారుతుంది. ఎండ కన్నెరుగనివ్వని ఈ జబ్బును ‘జీరోడెర్మా పిగ్మెంటోసమ్’ అంటారు.
జన్యువుల్లోని డీఎన్‌ఏలో తలెత్తే లోపాల వల్ల చాలామందికి బాల్యంలోనే ఈ వ్యాధి వస్తుంది. ఈ జబ్బు సోకిన వారు పగటివేళ ఆరుబయట సంచరించలేరు. రాత్రివేళల్లో మాత్రమే సురక్షితంగా సంచరించగలరు. అందుకే ఈ జబ్బు సోకిన చిన్నారులను ‘చిల్డ్రన్ ఆఫ్ నైట్’ అంటారు.
ఎండ కన్నెరుగనివ్వని జబ్బు
Published Thu, Feb 4 2016 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM
Advertisement
Advertisement