నిప్పుల కొలిమి
నందిగామలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
బెజవాడలో 42.7 డిగ్రీలు
అల్లాడిపోయిన నగరవాసులు
విజయవాడ : జిల్లాలో ఎండవేడి రోజురోజుకూ పెరిగి నిప్పుల కొలిమిగా మారుతోంది. నందిగామ, విజయవాడలో ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం తల్లడిల్లిపోయారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎండవేడిమి తీవ్రంగాఉండటంతో జనం ఆపసోపాలు పడ్డారు. ఉదయం ఆరు గంటలకే 31 డిగ్రీలతో ఎండవేడిమి ప్రారంభమై 10 గంటల సమయానికి 32 డిగ్రీలకు చేరింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటలకు ఎండ వేడిమి 42.7 డిగ్రీలకు పెరిగింది. మూడు గంటల నుంచి క్రమేపీ తగ్గుతూ వచ్చి సాయంత్రం ఆరు గంటలకు కూడా 39 డిగ్రీలకు చేరింది. ఎండ వేడిమి తాళలేక జనం ఇళ్ల నుంచి బయటకు రాలేదు. దీంతో నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జన సంచారం, వాహనాల రాకపోకలు లేక బందరు రోడ్డు వెలవెలబోయింది. ఏలూరు రోడ్డు, పోలీసు కంట్రోల్ రూమ్ ఏరియాల్లో కనీసం పిట్ట కూడా కనిపించలేదు. చిట్టినగర్, మొగల్రాజపురం, గుణదల తదితర కొండ ప్రాంత ఇళ్లలో నివసించే కుటుంబాలవారు ఎండవేడిమి తాళలేక నానా అగచాట్లు పడ్డారు.
అత్యవసర పనులపై బయటకు వచ్చేవారు గొడుగులు, తలలకు మాస్కులు వేసుకుని ఎండ వేడిమితో అవస్థలు పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఎం డవేడిమి, ఉక్కపోతకు అల్లాడిపోయారు. రోడ్లపై వేడి సెగలు వ్యాపించాయి. వాహనాల్లో కూడా జనం ప్రయాణించలేకపోయ ూరు. నందిగామలో శుక్రవారం గరిష్టంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.