
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన ఒక స్థానం మెరుగుపర్చుకుంది. తాజా ర్యాంకింగ్స్ లో స్మృతి 738 రేటింగ్ పాయింట్లతో మూడో ర్యాంక్‌కు చేరుకుంది.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 648 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. దీప్తి శర్మ 20వ ర్యాంక్‌లో, జెమీమా 33వ ర్యాంక్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ సివెర్ బ్రంట్ 783 పాయింట్లతో తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment