Third Rank
-
మూడో ర్యాంక్‌లో స్మృతి మంధాన
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన ఒక స్థానం మెరుగుపర్చుకుంది. తాజా ర్యాంకింగ్స్ లో స్మృతి 738 రేటింగ్ పాయింట్లతో మూడో ర్యాంక్‌కు చేరుకుంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 648 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. దీప్తి శర్మ 20వ ర్యాంక్‌లో, జెమీమా 33వ ర్యాంక్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ సివెర్ బ్రంట్ 783 పాయింట్లతో తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. -
గుంటూరుకు స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డు
-
మూడో ర్యాంక్‌లో భారత హాకీ జట్టు
న్యూఢిల్లీ: స్వదేశంలో తొలిసారి జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టు ర్యాంక్ కూడా మెరుగైంది. ఆదివారం విడుదల చేసిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) తాజా ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఒక స్థానం పురోగతి సాధించి నాలుగు నుంచి మూడో ర్యాంక్‌కు ఎగబాకింది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఖాతాలో 2771.35 పాయింట్లు ఉన్నాయి. 2021 తర్వాత భారత జట్టు మరోసారి మూడో ర్యాంక్‌లో నిలిచింది. 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత భారత జట్టు మూడో ర్యాంక్‌కు చేరింది. నెదర్లాండ్స్ జట్టు 3095.90 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా, 2917.87 పాయింట్లతో బెల్జియం రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఇంగ్లండ్ మూడు నుంచి నాలుగో స్థానానికి చేరగా... జర్మనీ, ఆ్రస్టేలియా వరుసగా ఐదు, ఆరో ర్యాంక్‌ల్లో ఉన్నాయి. తొలిసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన మలేసియా జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. హాకీ ఇండియా నజరానా ఆసియా చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 3 లక్షల చొప్పున... శిక్షణ బృందంలోని ప్రతి సభ్యుడికి రూ. లక్షా 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేస్తారు. -
తెలంగాణ బిడ్డకు మూడో ర్యాంకు..
సాక్షి, హైదరాబాద్: జాతీయ వైద్య విద్య అర్హత ప్రవేశ పరీక్ష (నీట్–2020) ఫలితాలు శుక్రవారం విడుదల య్యాయి. హైదరాబాద్‌కు చెందిన తుమ్మల స్నిఖిత ఆలిండియా మూడో ర్యాంకు సాధించారు. రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించారు. కాగా, నీట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. టాప్ 15 జాతీయ ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థులు ముగ్గురు ఉండగా, టాప్ 50 ర్యాంకుల్లో ఏకంగా ఏడుగురు ఉన్నారు. ఆలిండియా ర్యాంకుల్లో బాలురు అగ్రస్థానంలో నిలిచారు. తొలి 50 ర్యాంకుల్లో 31 ర్యాంకులను బాలురే దక్కించుకున్నారు. రాష్ట్రం నుంచి నీట్లో అనంత పరాక్రమ (11వ ర్యాంకు), బారెడ్డి సాయి త్రిషా రెడ్డి (14వ ర్యాంకు), శ్రీరామ్ సాయి శాంతవర్ధన్ (27వ ర్యాంకు ), ఆర్షశ్ అగర్వాల్ (30వ ర్యాంకు), మల్లేడి రుషిత్ (33వ ర్యాంకు), ఆవుల సుభాంగ్ (38వ ర్యాంకు) సాధించారు. బాలికల విభాగంలో తొలి 20 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన నిత్య దినేష్ (ఆలిండియా 58వ ర్యాంకు) 17వ స్థానాన్ని పొందారు. ఎయిమ్స్, జిప్మర్ సహా అన్ని ప్రముఖ మెడికల్ కాలేజీల్లోనూ ఈ ఏడాది నుంచి నీట్ ర్యాంకుల ప్రాతిపదికనే సీట్లను భర్తీ చేయనున్నారు. ఆలిండియా కోటాకు 467 సీట్లు.. తెలంగాణ నుంచి ఆలిండియా కోటాకు 467 ఎంబీబీఎస్ సీట్లు ఇస్తారు. ఆలిండియా కోటాలో రెండు విడతల ప్రవేశ ప్రక్రియల అనంతరం మిగిలిన సీట్లను రాష్ట్రాలకు ఇస్తారు. రాష్ట్ర ప్రవేశాలకు, అఖిల భారత వైద్యవిద్య సీట్ల కూటమి ప్రవేశాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రస్థాయిలో నిర్వహించే కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల ప్రవేశాలను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భర్తీ చేస్తారు. గతేడాది కంటే పెరిగిన మార్కులు.. గతేడాది కంటే మార్కులు పెరిగాయి. గతేడాది 500 మార్కులు వస్తే ఆలిండియా స్థాయిలో 35 వేల నుంచి 40 వేల ర్యాంకులు వచ్చాయి. ఈసారి అదే మార్కులకు 90 వేల వరకు ర్యాంకు వెళ్లింది. గతేడాది ఆలిండియా స్థాయిలో 40 వేలు ఉన్నవారికి కన్వీనర్ కోటాలో సీట్లు వచ్చాయి. ఈసారి 70 వేలకు పైగా ఆలిండియా ర్యాంకు ఉన్నవారికి కూడా కన్వీనర్ కోటా సీటు వస్తుంది. ఆలిండియా స్థాయిలో 70 వేల ర్యాంకు అయితే, రాష్ట్ర స్థాయిలో 2 వేల లోపు ర్యాంకు వస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది జనరల్‌లో కటాఫ్ మార్క్ 134 ఉంటే, ఈసారి 147 కటాఫ్ అర్హత మార్కు వచ్చింది. రిజర్వేషన్లో గతేడాది 107.. ఈసారి 113 కటాఫ్ మార్క్ ఉంది. గతేడాది టాప్ ర్యాంకు మార్కు 701 ఉండగా, ఇప్పుడు 700పైన 100 మంది ర్యాంకులు సాధించిన వారున్నారు. మూడు నెలలు సమయం దొరకడం వల్ల చదువుకోవడానికి వీలు కలిగింది. అయితే పరీక్ష జరగదన్న భావనతో కొందరు విద్యార్థులు ఉండటమే తక్కువ మంది అర్హత సాధించడానికి ప్రధాన కారణమని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ డీన్ శంకర్రావు అభిప్రాయపడ్డారు. ♦ఆలిండియా స్థాయిలో 15,97,435 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా, వీరిలో 13,66,945 (85.57 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ♦మొత్తం 11 భాషల్లో నిర్వహించిన పరీక్షకు ఇంగ్లిష్‌లో 12,63,273 (79.08 శాతం) మంది రాయగా, తెలుగులో 1,624 (0.10 శాతం) మంది రాశారు. ♦తెలంగాణలో 54,872 మంది నమోదు చేసుకోగా, 50,392 మంది హాజరయ్యా రు. వీరిలో 24,767 (49.15 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 67.44 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ♦అత్యధికంగా చండీగఢ్‌లో 75.64 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అత్యల్పంగా నాగాలాండ్‌లో 40.50 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రజలకు సేవ చేస్తా.. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదువుతాను. నాన్న డాక్టర్ సదానందరెడ్డి, కార్డియాలజిస్ట్, అమ్మ డాక్టర్ లక్ష్మి, గైనకాలజిస్టు. మా సొంతూరు నిజామాబాద్ జిల్లా పోచంపాడు దగ్గర వెల్కలూరు గ్రామం. మూడో ర్యాంకు రావడంపై చాలా సంతోషంగా ఉంది. మెడికల్ కోర్సు చేశాక ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నానని తెలిపారు. – తుమ్మల స్నిఖిత (3వ ర్యాంకు) ఎయిమ్స్‌లో చదువుతా.. నాన్న డాక్టర్ నారాయణ, అమ్మ ఆర్యా నారాయణ. వీరిద్దరే నాకు ఆదర్శం. జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదువుతాను. న్యూరాలజీలో స్పెషాలిటీ చేయాలనుకుంటున్నా. – బి.అనంతపరాక్రమ(11వ ర్యాంకు), బోడుప్పల్ న్యూరోసర్జన్ అవుతా.. అమ్మానాన్న బీఆర్‌ఎన్‌రెడ్డి, అనంతలక్ష్మి. జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరుతాను. న్యూరోసర్జన్‌గా సేవలు అందించాలనేదే నా లక్ష్యం. – బి.సాయి త్రిషారెడ్డి (14వ ర్యాంక్), బీరంగూడ పేదలకు సేవలందిస్తా.. నాన్న ఆవుల తేజోవర్ధన్, అమ్మ సంగీత, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, పేదలకు వైద్య సేవలు అందించాలన్నదే నా ధ్యేయం. – సుభాంగ్ యాదవ్ (38వ ర్యాంకు) -
పెళ్లయిన వారే ఎక్కువ హ్యాపీ..
సాక్షి, హైదరాబాద్: దేశంలో మొట్టమొదటి ఆలిండియా హ్యాపీనెస్ రిపోర్ట్‌లోని పెద్ద రాష్ట్రాల కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు ముందు వరసలో నిలిచాయి. ఇందులో తెలంగాణ మూడో స్థానం, ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానం దక్కించుకున్నాయి. ఈ జాబితాలో పంజాబ్, గుజరాత్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక మొత్తంగా అంటే దేశంలోని 36 చిన్న, పెద్ద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలుపుకొని ఆయా పరిశీలన అంశాల వారీగా చూస్తే.. మిజోరాం, పంజాబ్, అండమాన్ నికోబార్ ఓవరాల్‌గా టాప్ త్రీ ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. ఏమిటీ రిపోర్ట్..? దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రజల ఆనందం, సంతోషం వంటి వాటికి దోహదపడే అంశాలను పరిశీలించి, వివిధ విషయాలపై సమాచార సేకరణ ద్వారా హ్యాపీనెస్‌ను కొలిచేందుకు ఆలిండియా హ్యాపీనెస్ సర్వే చేశారు. ఈ అధ్యయనంలో భాగంగా మేనేజ్మెంట్, వ్యూహాత్మక అంశాల్లో నిపుణుడైన ప్రముఖ ప్రొఫెసర్ రాజేశ్ కె.పిల్లానియా మార్చి–జూలై మధ్యకాలంలో జాతీయస్థాయిలో 16,950 మంది నుంచి వివిధ అంశాలపై ఒక ప్రశ్నావళి ద్వారా వారి అభిప్రాయాలు సేకరించారు. కోవిడ్ కారణంగా సంతోషంపై తీవ్ర ›ప్రభావం పడుతోందని మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణాలకు చెందిన వారు అభిప్రాయపడగా తమ హ్యాపీనెస్‌పై కోవిడ్ సానుకూల ప్రభావం చూపుతోందనే భావనను మణిపూర్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వాసులు వ్యక్తంచేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రాజ్‌మోహన్‌గాంధీ, కారీ కూపర్, ఆష్లే విలియమ్స్, ఎమ్మా సెప్పాలా, జెన్నీఫర్ మోస్, దాసో కర్మ ఉరా, టీవీరావు, దేవ్‌దత్ పట్నాయక్ల అభిప్రాయాలు కూడా క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు. భవిష్యత్‌పై ఆశాభావం.. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రజలు సంతోషానికి సంబంధించి స్పందించిన తీరు భిన్నంగా ఉన్నా అందరూ మాత్రం భవిష్యత్ పట్ల ఆశాభావం వెలిబుచ్చడం విశేషం. సంతోషం, ఆనందం ఎలా ఉంటాయన్నది తెలుసుకోవడమే కాకుండా దానిని అనుభవించడం, రోజువారీ జీవితంలో దానిని పాటించడం ముఖ్యమనేది కూడా ఈ అధ్యయనంలో వెల్లడైంది. హ్యాపీనెస్ అంచనాకు పరిగణనలోకి తీసుకున్న అంశాలు.. ► చేసే పని, దానితో ముడిపడిన అంశాలు, ఆదాయం, పురోగతి, వృద్ధి ► కుటుంబం, స్నేహితులతో సంబంధాలు ► శారీరక, మానసిక ఆరోగ్యాలు ► దాతృత్వం, సామాజిక అంశాలు ► మతపరమైన లేదా ఆధ్యాత్మిక అవగాహన ► వీటితో పాటు కోవిడ్–19 నేపథ్యంలో హ్యాపీనెస్‌పై, దాని ప్రభావంపైనా అభిప్రాయాలు సేకరించారు. ఎవరీ రాజేశ్ పిల్లానియా.. ‘టాప్ ప్రొఫెసర్ ఆఫ్ స్ట్రాటజీ ఇన్ ఇండియా’గా ప్రొఫెసర్ రాజేశ్‌ను అసోచామ్, ఎడ్యుకేషన్ పోస్ట్ గుర్తించాయి. అనేక అంతర్జాతీయ రీసెర్చ్ జర్నల్స్, ఇతర సంస్థలు, కాన్ఫరెన్స్‌ల అడ్వైజరీ బోర్డుల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. రచయితగానూ, టీచర్‌గానూ పేరుప్రతిష్టలున్నాయి. వివిధ జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, బిజినెస్ స్కూళ్లలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన చేపట్టిన ‘మేనేజ్మెంట్ లెర్నింగ్స్ ఫ్రం మై మదర్’అనే ప్రాజెక్టు విశిష్టమైనది. పెళ్లయిన వారే ఎక్కువ హ్యాపీ.. ఆనందం లేదా సంతోషానికి లింగ భేదం లేదని వెల్లడైంది. ఆడ, మగ అనే సంబంధం లేకుండా హ్యాపీనెస్ అనుభూతిని పొందుతున్నారు. వివాహం, ఏజ్ గ్రూపు, విద్యార్హతలు, ఆదాయ స్థాయి వంటివి మొత్తంగా హ్యాపీనెస్‌కు పాజిటివ్ అంశాలుగా తేలింది. ఇక పెళ్లి కాని వారి కంటే పెళ్లైన వారే ఎక్కువ సంతోషంగా ఉన్నట్టుగా ఈ నివేదికలో వెల్లడైంది. టాప్ ర్యాంకులు ఇవే... ఓవరాల్‌గా చూస్తే... 1) మిజోరాం 2) పంజాబ్ 3) అండమాన్ నికోబార్ దీవులు పెద్దరాష్ట్రాల్లో.. 1) పంజాబ్ 2) గుజరాత్ 3) తెలంగాణ 5) ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో.. 1) పుదుచ్చేరి 2) తెలంగాణ 3) ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రాల్లో.. 1)మిజోరాం 2) సిక్కిం 3) అరుణాచ ప్రదేశ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. 1) అండమాన్ నికోబార్ 2) పుదుచ్చేరి 3) లక్షద్వీప్ చివర్లో నిలిచిన రాష్ట్రాలు: ఛత్తీస్‌గఢ్ (36వ స్థానం), ఉత్తరాఖండ్ (35వ స్థానం), ఒడిశా (34 వ స్థానం) -
‘హ్యాట్సాఫ్ బ్రాడ్’
ముంబై: టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని దాటిన ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభినందనలు తెలిపాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో (2007 టి20 వరల్డ్‌కప్‌లో) తన చేతిలో చావు దెబ్బ తిన్న బ్రాడ్లా గుర్తుంచుకోకుండా... కనీసం ఇప్పుడైనా ఒక బౌలర్‌గా అతని ఘనతను గుర్తించాలని ఈ సందర్భంగా యువీ తన అభిమానులను కోరాడు. ‘నేను స్టువర్ట్ బ్రాడ్ గురించి ఎప్పుడు ఏది రాసినా జనం ఆ ఆరు సిక్సర్లనే గుర్తు చేసుకుంటారని నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు దాని ప్రస్తావన లేకుండా అతను సాధించిన ఘనతను అభినందించాలని నా అభిమానులను కోరుతున్నా. 500 టెస్టు వికెట్లు అంటే చిన్న విషయం కాదు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, అంకితభావం, పట్టుదల దీని వెనక దాగి ఉంటాయి. వెనకబడిన ప్రతీసారి పోరాటపటిమ కనపర్చి నువ్వు మళ్లీ దూసుకొచ్చావు మిత్రమా...నువ్వో దిగ్గజానికి బ్రాడ్... నీకు నా అభినందనలు’ అని యువరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మూడో ర్యాంక్‌కు బ్రాడ్... విండీస్‌తో చివరి టెస్టులో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (10/67) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరాడు. 2016 తర్వాత తొలిసారిగా ఐసీసీ ర్యాంకుల్లో మూడో స్థానానికి చేరిన బ్రాడ్... ఆల్‌రౌండర్ల కేటగిరీలో 11వ ర్యాంకును అందుకున్నాడు. మరోవైపు కరోనా కారణంగా నాలుగు నెలలుగా ఆటకు దూరమైన భారత అగ్రశ్రేణి క్రికెటర్లు (టాప్–10) టెస్టు ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాట్స్‌మెన్ కేటగిరీలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానాన్ని... పుజరా, రహానే వరుసగా ఏడు, తొమ్మిదో ర్యాంకుల్ని కాపాడుకున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (మూడు), రవిచంద్రన్ అశ్విన్ (ఐదు) స్థానాలు పదిలంగా ఉన్నాయి. బౌలర్ల కేటగిరీలో స్టార్ బౌలర్ బుమ్రా ఒక స్థానం పడిపోయి ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచాడు. -
షఫాలీ చేజారిన టాప్ ర్యాంక్
దుబాయ్: టి20 వరల్డ్ కప్ ఫైనల్లో వైఫల్యం భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది. సోమవారం విడుదలైన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్‌లో 16 ఏళ్ల షఫాలీ వర్మ టాప్ ర్యాంక్ నుంచి పడిపోయి 744 రేటింగ్ పాయింట్లతో మూడో ర్యాంక్‌కు చేరుకుంది. టి20 ప్రపంచకప్‌లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక షఫాలీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఫైనల్లో షఫాలీ కేవలం రెండు పరుగులు చేసి అవుటవ్వడంతో ఆమె ర్యాంక్ పడిపోయింది. ఫైనల్లో అజేయంగా 78 పరుగులు చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ బెథ్ మూనీ రెండు స్థానాలు పురోగతి సాధించి 762 ర్యాంకింగ్ పాయింట్లతో కొత్త ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ 750 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌లో కొనసాగుతోంది. భారత్‌కే చెందిన స్మృతి మంధాన ఏడో ర్యాంక్‌లో, జెమీమా రోడ్రిగ్స్ తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, రాధా యాదవ్, పూనమ్ యాదవ్ వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. -
‘స్కిల్డ్’లో గ్రేటర్ నం.3
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఆకర్షించటంలో దేశంలో మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్ స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో దేశ రాజధాని ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది. ద్వితీయస్థానంలో గ్రీన్‌సిటీ బెంగళూరు నిలిచింది. నైపుణ్యం గల ఉద్యోగులకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్న నగరాలపై అతిపెద్ద ’ప్రొఫెషనల్ నెట్వర్క్’అయిన ‘లింక్డ్ఇన్’ తాజా అధ్యయనం ‘భారత ఉద్యోగస్తుల నివేదిక’లో ఈ వివరాలు వెల్లడించింది. కొత్తగా ఏఏ రంగాల్లో ఉద్యోగాలు అధికంగా వస్తున్నాయి.. ఎటువంటి నిపుణులకు గిరాకీ ఉంది.. దేశంలోని ఏఏ నగరాలు సమర్థులైన ఉద్యోగులను ఆకర్షించగలుగుతున్నాయి... అనే విశేషాలతోఈ నివేదికను లింక్డ్ఇన్ రూపొందించింది. యువ ఉద్యోగులు భారత్‌లోనే అధికం.. ప్రపంచవ్యాప్తంగా యువ జనాభా, యువ ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం భారతేనని ఈ నివేదిక పేర్కొంది. ఉద్యోగాలు, ఉద్యోగస్తుల తీరుతెన్నులను ప్రతిబింబిస్తూ ఈ నివేదిక రూపొందించినట్లు లింక్డ్ఇన్ ఇండియా పేర్కొంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ రంగాలకు 2020 తొలి త్రైమాసికంలో విశేష గిరాకీ కనిపించినట్లు తెలిపారు. నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షించటంలో ముందున్న నగరాలు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ చండీగఢ్, వడోదర, జయపుర ఉన్నాయి. ఈ రంగాల్లోనే అత్యధిక కొలువులు.. 1.సాఫ్ట్వేర్, ఐటీ సేవలు 2.తయారీ రంగం, ఫైనాన్స్, కార్పొరేట్ సేవలు 3.విద్యా రంగం యువతలో డాలర్ డ్రీమ్స్.. దేశంలో పలు మెట్రో నగరాల్లో విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నప్పటికీ యువతలో డాలర్ డ్రీమ్స్ కనుమరుగు కాలేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. కాస్తోకూస్తో చదువుకొని విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగంలో స్ధిరపడాలని కోరుకునే యువకుల సంఖ్య ఇటీవల కాలంలో పలు నగరాల్లో పెరిగిపోతోందని ఈ నివేదిక వెల్లడించింది. యువత ప్రధానంగా ఏ దేశాలకు వెళుతున్నారనేది పరిశీలించగా.. మొదట అమెరికా ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో యూఏఈ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా దేశాలున్నాయి. ఈ రంగాల్లో నైపుణ్యాలకు భలే గిరాకీ.. 1. ఉత్పత్తి, నిర్మాణ రంగం, విద్యుత్, మైనింగ్ రంగాల్లో ఆటో క్యాడ్ నిపుణులకు గిరాకీ ఉంది 2. మేనేజ్మెంట్ ఉద్యోగార్థుల్లో నాయకత్వ లక్షణాలు, కస్టమర్ సర్వీస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సామర్థ్యాలు ప్రదర్శించే వారికి పెద్దగా వెతుక్కునే పనిలేకుండానే ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉంది. 3. ముంబై, ఢిల్లీ నగరాల్లో మేనేజ్మెంట్ రంగంలో అధికంగా ఉద్యోగాలున్నాయి. ఐటీ ఉద్యోగాలకు బెంగళూరు సిటీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని తాజా నివేదిక వెల్లడించింది. -
మూడో ర్యాంకులో శ్రీకాంత్
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ మూడో ర్యాంకుకు ఎగబాకాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గురువారం విడుదల చేసిన సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 3వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇటీవల టాప్ ర్యాంకులో నిలిచిన ఈ ఆంధ్రప్రదేశ్ ఆటగాడు వారం వ్యవధిలోనే ఐదో ర్యాంకుకు పడిపోయాడు. మరో భారత ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్ కూడా రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు. ఈ జాబితాలో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), సన్ వాన్ హో (కొరియా) తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు నిలకడగా మూడో ర్యాంకులోనే కొనసాగుతోంది. కామన్వెల్త్ ఫైనల్లో సింధును ఓడించి స్వర్ణం గెలిచిన హైదరాబాదీ స్టార్ సైనా నెహ్వాల్ రెండు స్థానాల్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంకుకు చేరుకుంది. ఈ ర్యాంకింగ్స్‌లో తై జు యింగ్ (చైనీస్ తైపీ), యామగుచి (జపాన్) టాప్–2 ర్యాంకుల్లో ఉన్నారు. -
ఇద్దరూ ఇద్దరే
కృషితో నాస్తి దుర్భిక్షం.. అన్న పదానికి సిసలైన నిదర్శనంగా నిలిచారు. రేయింబవళ్లు యజ్ఞంలా శ్రమించారు. అదే వారిద్దరినీ గ్రూప్ వన్ విజేతల్ని చేసింది. అత్యుత్తమ ర్యాంకుల్ని కట్టబెట్టింది. ప్రతిష్టాత్మకమైన గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో పార్వతీపురానికి చెందిన ఇద్దరికి వరుసగా 2, 3 ర్యాంకులు లభించడం విశేషం. పంచాయతీరాజ్ శాఖలో డివిజినల్ అకౌంట్స్ అధికారి కె.హేమలతకు రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, పార్వతీపురం వివేక్ కాలనీకి చెందిన భవానీశంకర్‌కు రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు లభించాయి. పార్వతీపురం: శ్రీకాకుళం జిల్లా కనుగులవాని పేట గ్రామం వ్యవసాయ కుటుంబానికి చెందిన హేమలత తండ్రి రైతు. పిల్లలకు ఉన్నత విద్య చదివించి వారిని ప్రయోజకులను చేయాలని పరితపించేవారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగానే పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. హేమలత అక్క హైమావతి ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. సోదరుడు జగదీశ్వరరావు తెలంగాణా నీటిపారుదల శాఖలో ఏఈఈగా పనిచేస్తున్నారు. హేమలత భర్త నర్సీపట్నంలో అటవీ శాఖాధికారిగా పనిచేస్తున్నారు. 2007లో సివిల్స్‌లో 13 మార్కులతో, 2010లో 1 మార్కుతో ఇంటర్వ్యూ వరకు వచ్చి అవకాశం చేజార్చుకున్నారు. 2016లో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షను రాసి తాజాగా రాష్ట్ర స్థాయిలో రెండోస్థానంలో నిలి చారు. మహిళా విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచారు. రోజూ 13 గంటలు చదివా రోజుకు 13 గంటల పాటు చదివాను. రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకును సాధించుకున్నందుకు ఆనందంగా ఉంది. తొలి ప్రయత్నం తోనే 460.5 మార్కులు సాధించాను. ప్రజలకు ఏదైనా చేయడానికి నాకు ఒక అవకాశం లభించిందన్న సంతోషం ఎక్కువగా కలుగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. – భవానీశంకర్, పార్వతీపురం తండ్రి స్ఫూర్తితో మూడో ర్యాంకు సాధించిన భవానీ శంకర్ స్వస్థలం గరుగుబిల్లి మండలం గిజబ గ్రామం. ప్రస్తుతం పార్వతీపురంలో నివసిస్తున్నారు. ఆయన తండ్రి అప్పలనాయుడు డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసేవారు. కార్యాలయంలో, ఇంటా బయటా తండ్రికి లభించే గౌరవం, ప్రజా సమస్యలపై ఎప్పుడు చర్చించడం గమనించేవాడు. ఏదైనా పనిచేసి పెడితే ప్రజలు చూపించే అభిమానంతో స్ఫూర్తి పొందాడు. తండ్రి అప్పలనాయుడు, తల్లి రూపాదేవి ప్రోత్సాహం లక్ష్యానికి తోడైంది. భవానీ శంకర్ 10వ తరగతి వరకు పార్వతీపురంలోనే చదివారు. ఎంసీఏ చేసినప్పటికీ గ్రూప్స్‌పై ఇష్టంతో కష్టపడి చదివి విజయం సాధించారు. -
నేను ఏ సెంటర్లోనూ కోచింగ్ తీసుకోలేదు
హైదరాబాద్: ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం, లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన ఉంటే ఇంగ్లిష్ మీడియమైనా, తెలుగు మీడియమైనా, గ్రామీణ ప్రాంతమైనా, పట్టణ ప్రాంతం వారైనా విజయం సాధించవచ్చని, అందుకు ఉదాహరణ తానే అని సివిల్స్ ఆలిండియా మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. ‘వివిధ కోచింగ్ సెంటర్ల వారు ప్రచారం చేసుకుంటున్నట్లుగా నేను ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. కొన్ని నెలలు బాలలత గారి సీఎస్బీ ఐఏఎస్ అకాడమీలో మాత్రమే శిక్షణ పొం దాను’ అని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ, సివి ల్స్‌కు సిద్ధమవుతున్న యువత తన పేరును, ఫొటోను ప్రచారం చేసుకుంటున్న కోచింగ్ సెంట ర్లకు వెళ్లరాదని, అవి అవాస్తవాలని, తమకు నచ్చిన కోచింగ్ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. సుమా రు 10 కోచింగ్ సెంటర్లలో మాక్ ఇంటర్వూ్యలకు వెళ్లానని, అప్పుడు తీసుకున్న వీడియోలు, ఫొటో లతో ఇప్పుడు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటు న్నారని, అంతకుమించి ఆ కోచింగ్ సెంటర్లతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. వివిధ కోచింగ్ సెంటర్లకు అప్పుడే అమ్ముడు పోయావా గోపాల కృష్ణ.. అని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తు న్నారని, అందుకే మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. ఐఎఎస్ అధికారినయ్యాక విద్య, వైద్యం, రైతు సమస్యలు, మహిళా సాధికారత తదితర అం శాలపై దృష్టి పెడతానని, ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో అంద రికీ చేరేలా కృషి చేస్తానన్నారు. ‘మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తారా’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తానని సమాధానమిచ్చారు.