నేను ఏ సెంటర్‌లోనూ కోచింగ్‌ తీసుకోలేదు | I did not take coaching in any center | Sakshi
Sakshi News home page

నేను ఏ సెంటర్‌లోనూ కోచింగ్‌ తీసుకోలేదు

Published Fri, Jun 9 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

నేను ఏ సెంటర్‌లోనూ కోచింగ్‌ తీసుకోలేదు

నేను ఏ సెంటర్‌లోనూ కోచింగ్‌ తీసుకోలేదు

హైదరాబాద్‌: ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం, లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన ఉంటే ఇంగ్లిష్‌ మీడియమైనా, తెలుగు మీడియమైనా, గ్రామీణ ప్రాంతమైనా, పట్టణ ప్రాంతం వారైనా విజయం సాధించవచ్చని, అందుకు ఉదాహరణ తానే అని సివిల్స్‌ ఆలిండియా మూడో ర్యాంకర్‌ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. ‘వివిధ కోచింగ్‌ సెంటర్ల వారు ప్రచారం చేసుకుంటున్నట్లుగా నేను ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. కొన్ని నెలలు బాలలత గారి సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీలో మాత్రమే శిక్షణ పొం దాను’ అని ఆయన స్పష్టం చేశారు.

 గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ, సివి ల్స్‌కు సిద్ధమవుతున్న యువత తన పేరును, ఫొటోను ప్రచారం చేసుకుంటున్న కోచింగ్‌ సెంట ర్లకు వెళ్లరాదని, అవి అవాస్తవాలని, తమకు నచ్చిన కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. సుమా రు 10 కోచింగ్‌ సెంటర్లలో మాక్‌ ఇంటర్వూ్యలకు వెళ్లానని, అప్పుడు తీసుకున్న వీడియోలు, ఫొటో లతో ఇప్పుడు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటు న్నారని, అంతకుమించి ఆ కోచింగ్‌ సెంటర్లతో తనకెలాంటి సంబంధం లేదన్నారు.

 వివిధ కోచింగ్‌ సెంటర్లకు అప్పుడే అమ్ముడు పోయావా గోపాల కృష్ణ.. అని కొందరు సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తు న్నారని, అందుకే మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. ఐఎఎస్‌ అధికారినయ్యాక విద్య, వైద్యం, రైతు సమస్యలు, మహిళా సాధికారత తదితర అం శాలపై దృష్టి పెడతానని, ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో అంద రికీ చేరేలా కృషి చేస్తానన్నారు. ‘మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తారా’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తానని సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement