ronanki gopala krishna
-
గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన రోణంకి తండ్రి
సాక్షి, శ్రీకాకుళం : జిల్లా పలాస మున్సిపాలిటీలో గల పారసాంబ గ్రామంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2016 సివిల్స్ మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ తండ్రి గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోణంకి కుటుంబీకులకు, గ్రామస్థులకు మధ్య గత కొంతకాలంగా ఓ ఇంటిస్థలం మీద వివాదం నడుస్తోంది. ఆ స్థలంలో గ్రామస్థులు ఏర్పాటు చేసిన జాతి పిత విగ్రహం ధ్వంసం చేయడం వివాదాస్పదంగా మారింది. -
సివిల్స్ ర్యాంకర్‌పై పిల్.. కౌంటర్ దాఖలుకు ఆదేశం
హైదరాబాద్: సివిల్స్ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ అంగవైకల్యాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) హైకోర్టు విచారణ చేపట్టింది. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లికి చెందిన న్యాయవాది ఎం.మురళీకృష్ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని యూపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలు వాయిదా వేసింది. సివిల్ సర్వీసెస్–2016 పరీక్షలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణ మూడో ర్యాంకు సాధించారు. అయితే గోపాలకృష్ణ తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించి పరీక్షకు హాజరయ్యారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఓబీసీ అయిన గోపాలకృష్ణ ఆర్థోపెడికల్ విభాగంలో 45 శాతం మేర అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించారని వెల్లడించారు. ఓబీసీలకు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులు 110.66 అని, అయితే గోపాలకృష్ణ 91.34 మార్కులు మాత్రమే సాధించారన్నారు. వికలాంగ కోటా కింద అర్హతకు 75.34 మార్కులని, దీంతో అతడు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. -
నేను ఏ సెంటర్లోనూ కోచింగ్ తీసుకోలేదు
హైదరాబాద్: ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం, లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన ఉంటే ఇంగ్లిష్ మీడియమైనా, తెలుగు మీడియమైనా, గ్రామీణ ప్రాంతమైనా, పట్టణ ప్రాంతం వారైనా విజయం సాధించవచ్చని, అందుకు ఉదాహరణ తానే అని సివిల్స్ ఆలిండియా మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. ‘వివిధ కోచింగ్ సెంటర్ల వారు ప్రచారం చేసుకుంటున్నట్లుగా నేను ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. కొన్ని నెలలు బాలలత గారి సీఎస్బీ ఐఏఎస్ అకాడమీలో మాత్రమే శిక్షణ పొం దాను’ అని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ, సివి ల్స్‌కు సిద్ధమవుతున్న యువత తన పేరును, ఫొటోను ప్రచారం చేసుకుంటున్న కోచింగ్ సెంట ర్లకు వెళ్లరాదని, అవి అవాస్తవాలని, తమకు నచ్చిన కోచింగ్ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. సుమా రు 10 కోచింగ్ సెంటర్లలో మాక్ ఇంటర్వూ్యలకు వెళ్లానని, అప్పుడు తీసుకున్న వీడియోలు, ఫొటో లతో ఇప్పుడు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటు న్నారని, అంతకుమించి ఆ కోచింగ్ సెంటర్లతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. వివిధ కోచింగ్ సెంటర్లకు అప్పుడే అమ్ముడు పోయావా గోపాల కృష్ణ.. అని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తు న్నారని, అందుకే మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. ఐఎఎస్ అధికారినయ్యాక విద్య, వైద్యం, రైతు సమస్యలు, మహిళా సాధికారత తదితర అం శాలపై దృష్టి పెడతానని, ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో అంద రికీ చేరేలా కృషి చేస్తానన్నారు. ‘మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తారా’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తానని సమాధానమిచ్చారు. -
కోచింగ్ సెంటర్లపై గోపాలకృష్ణ మండిపాటు
హైదరాబాద్: కోచింగ్ సెంటర్ల వ్యవహారశైలిపై సివిల్స్ ఆలిండియా మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ మండిపడ్డారు. కోచింగ్ సెంటర్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దంటూ నిరుద్యోగులను సలహా ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. కానీ కొన్ని కోచింగ్ సెంటర్లు కావాలనే నా పేరును వాడుకుంటున్నాయి. ఇది దారుణం. మరోసారి స్పష్టం చేస్తున్నా.. నేను సొంతగానే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యా. తెలుగు సాహిత్యం సొంతగా చదివా, జనరల్ స్టడీస్ మాత్రం బాలలతగారి దగ్గర శిక్షణపొందా. సిటీలోని పలు కోచింగ్ సెంటర్లు నా పేరును, ర్యాంకుతో ప్రకటనలు ఇస్తున్నాయి. అవి తప్పుడు ప్రకటనలు’ అని గోపాలకృష్ణ చెప్పారు. సివిల్స్ పరీక్షలు రాయగోరే అభ్యర్థులు సొంత ప్రిపరేషన్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తే మంచిదని గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. అలా కుదరని పక్షంలో నచ్చిన కోచింగ్ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. అయితే కోచింగ్ సెంటర్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని హితవుపలికారు.