న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ మూడో ర్యాంకుకు ఎగబాకాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గురువారం విడుదల చేసిన సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 3వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇటీవల టాప్ ర్యాంకులో నిలిచిన ఈ ఆంధ్రప్రదేశ్ ఆటగాడు వారం వ్యవధిలోనే ఐదో ర్యాంకుకు పడిపోయాడు. మరో భారత ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్ కూడా రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు. ఈ జాబితాలో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), సన్ వాన్ హో (కొరియా) తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు నిలకడగా మూడో ర్యాంకులోనే కొనసాగుతోంది. కామన్వెల్త్ ఫైనల్లో సింధును ఓడించి స్వర్ణం గెలిచిన హైదరాబాదీ స్టార్ సైనా నెహ్వాల్ రెండు స్థానాల్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంకుకు చేరుకుంది. ఈ ర్యాంకింగ్స్‌లో తై జు యింగ్ (చైనీస్ తైపీ), యామగుచి (జపాన్) టాప్–2 ర్యాంకుల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment