ఐసీసీ చైర్మన్‌గా శ్రీనివాసన్? | Emergent WC will pass BCCI's bid to get more revenue from ICC | Sakshi
Sakshi News home page

ఐసీసీ చైర్మన్‌గా శ్రీనివాసన్?

Published Tue, Jan 21 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

ఐసీసీ చైర్మన్‌గా శ్రీనివాసన్?

ఐసీసీ చైర్మన్‌గా శ్రీనివాసన్?

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి చైర్మన్‌గా బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం చెన్నైలో జరిగే బోర్డు అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈమేరకు చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత బోర్డు పాలకమండలి ఆయన పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది.

 అలాగే బోర్డు నుంచి ఐసీసీకి వెళుతున్న భారీ ఆదాయంలో అధిక వాటాను అడిగేందుకు కమిటీ సిద్ధమవుతోంది. ‘ఐసీసీ చైర్మన్‌గా శ్రీనివాసన్ పేరును ప్రతిపాదించే అధికారం వర్కింగ్ కమిటీకి ఉండదు. అయితే చర్చించే వీలుంటుంది. ఆ పదవి విషయంలో ఆయనకు బీసీసీఐ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కానీ పాలక మండలి సమావేశం అంగీకారం కావాల్సి ఉంటుంది’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఐసీసీలో ఇంతకాలం చైర్మన్ పదవి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement